కరోనా సమయంలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన ఆనందయ్య పసరు మందుకు జనాలు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అప్పట్లో దీనిపై అయిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వకున్నా జనాలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఒకానొక సమయంలో జనాలను కంట్రోల్ చేసేందుకు అటు ఏపీ ప్రభుత్వానికి సైతం ఇబ్బందులు తప్పలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆనందయ్య మందును శాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేయడం లేదంటూ మందు పంపిణీ నిలిపి వేయాలని…
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. గత ఏడాది ఎస్పీ బాలు వంటి లెజెండ్ కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. తాజాగా తమిళ సినీ నటుడు, సీనియర్ కమెడియన్ వడివేలు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. Read Also: రివ్యూ : శ్యామ్ సింగరాయ్ ఇటీవల లండన్‌లో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని మూడు రోజుల కిందట ఇండియా…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్‌లో అడుగుపెట్టింది.. క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూనే ఉంది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే కాగా… తాజాగా, తూర్పుగోదావరి జిల్లాలోనూ ఒమిక్రాన్ వెలుగు చూసింది… తూర్పు గోదావరి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.. దీంతో.. కోనసీమలో కలకలం మొదలైంది. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. బాధితురాలు ఇటీవలే గల్ఫ్ నుంచి వచ్చినట్టుగా…
ఇండియా కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 6,650 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 374 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,72,626 కు చేరుకుంది. అలాగే రికవరీల సంఖ్య 3,42,15,977 కు చేరింది. ఇక మరణాల సంఖ్య 4,79,133 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం…
కరోనా వైరస్‌కు పుట్టినిల్లు చైనా. చైనాలోని వూహాన్ నగరంలో ఈ వైరస్ పుట్టింది. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకిందిని చెబుతున్నా, ల్యాబ్ నుంచే లీక్ అయిందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వైరస్‌తో గత రెండేళ్లుగా ప్రపంచదేశాలు పోరాటం చేస్తున్నాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చినా వైరస్ లొంగడం లేదు. రూపం మార్చుకొని కొత్తగా విజృంభిస్తోంది. ప్రపంచం యావత్తు ఈ వైరస్ దెబ్బకు ఆర్ధికంగా కుదేలైపోయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒమిక్రాన్ వేరియంట్‌తో ఇబ్బందులు పడుతుంటే, చైనాలో…
ఆంధ్రప్రదేశ్ లో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31, 158 శాంపిల్స్ పరీక్షించగా.. 135 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 164 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,10,98,568 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 293 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకొని కోవిడ్, ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం మరోసారి సూచించింది. ఒమిక్రాన్ కట్టడిపై కేంద్రం అలర్ట్ అయింది. కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఒమిక్రాన్ పట్ల అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. ఎక్కువ కేసులున్న కోవిడ్ క్లస్టర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని,…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతూనే ఉంది… ఇప్పటికే భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భారీ నష్టాన్ని మిగిల్చడంతో.. కొత్త వేరియంట్‌ను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టిసారించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు… దేశంలో కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని సమీక్షిస్తారు. రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు…
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 14 మందికి కరోనా నిర్ధారణ జరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే మాస్క్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మాస్క్ లేకుంటే భారీ జరిమానాలు విధిస్తున్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైతే నైట్…
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్ రక్షణ వ్యవస్థను దాటుకొని విజృంభిస్తుండటంతో కొత్త సంవత్సరం వేడుకలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలపై కర్ణాటక సర్కార్ నిషేధం విధించగా, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఢిల్లీ సర్కార్ నిషేధం విధించింది. కాగా, హర్యానా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి జనవరి 1 తరువాత పూర్తి వ్యాక్సిన్ తీసుకోని వారిని రోడ్డు మీదకు రాకుండా కట్టడి…