కరోనా సమయంలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన ఆనందయ్య పసరు మందుకు జనాలు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అప్పట్లో దీనిపై అయిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వకున్నా జనాలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఒకానొక సమయంలో జనాలను కంట్రోల్ చేసేందుకు అటు ఏపీ ప్రభుత్వానికి సైతం ఇబ్బందులు తప్పలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆనందయ్య మందును శాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేయడం లేదంటూ మందు పంపిణీ నిలిపి వేయాలని ఆయుష్ శాఖ కోరింది.
ఆ తర్వాత కేంద్ర వైద్య బృందాలు పరిశీలించిన మీదట మందు పంపిణీ నిలిపివేయాల్సిందేనని ఆనందయ్యను కోరింది. అయితే తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య పసరు మందుకు ఆయుష్ శాఖ అనుమతిని నిరాకరించింది. ఒమిక్రాన్ వేరింయంట్‌కు మందు ఇస్తానని ఆనందయ్య ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ తమను సంప్రదించలేదని, ఇలాంటి గుర్తింపు లేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేదిక్ మందులుగా పరిగణించి వాడొద్దని ఆయుష్ శాఖ తెలిపింది. గుర్తింపు పొందిన ఆయుష్-64, ఆర్సెనిక్ ఆల్బమ్ 30సి లాంటి మందులనే వాడాలని సూచించింది.