దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్ రక్షణ వ్యవస్థను దాటుకొని విజృంభిస్తుండటంతో కొత్త సంవత్సరం వేడుకలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలపై కర్ణాటక సర్కార్ నిషేధం విధించగా, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఢిల్లీ సర్కార్ నిషేధం విధించింది. కాగా, హర్యానా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి జనవరి 1 తరువాత పూర్తి వ్యాక్సిన్ తీసుకోని వారిని రోడ్డు మీదకు రాకుండా కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read: కింగ్ ఆఫ్ ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ!
రెండు డోసులు వేసుకోని వారిని వివాహాలు, ఫంక్షన్ హాల్లు, పబ్లిక్ ప్లేసులు, సినిమా హాల్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బస్సుల్లో తిరగనివ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. తప్పని సరిగా ప్రజలు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని హర్యానా ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నిబంధనలను కఠినంగా అమలు చేసి తీరుతామని తెలియజేసింది.