కరోనా వైరస్‌కు పుట్టినిల్లు చైనా. చైనాలోని వూహాన్ నగరంలో ఈ వైరస్ పుట్టింది. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకిందిని చెబుతున్నా, ల్యాబ్ నుంచే లీక్ అయిందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వైరస్‌తో గత రెండేళ్లుగా ప్రపంచదేశాలు పోరాటం చేస్తున్నాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చినా వైరస్ లొంగడం లేదు. రూపం మార్చుకొని కొత్తగా విజృంభిస్తోంది. ప్రపంచం యావత్తు ఈ వైరస్ దెబ్బకు ఆర్ధికంగా కుదేలైపోయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒమిక్రాన్ వేరియంట్‌తో ఇబ్బందులు పడుతుంటే, చైనాలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదవ్వలేదు. ఈ విషయాన్ని చైనా స్వయంగా ప్రకటించింది.
Read: ఒమిక్రాన్ టెన్షన్… గుజరాత్‌లో నైట్ కర్ఫ్యూ…
ఇలాంటి ప్రకటన చేస్తూనే, చైనాలోని పెద్ద నగరాల్లో ఒకటైన జియాన్‌లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను విధించింది. ఈరోజు నుంచి ఈ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దేశీయంగా విమానాలను రద్దు చేసింది. నిబంధనలను ఎవరూ ఉల్లంఘించకూడదని ఆదేశాలు జారీ చేసింది. జియాన్‌తో పాటుగా మరికొన్ని నగరాల్లో కూడా వూహాన్ తరహా లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చైనాలో మళ్లీ వూహాన్ తరహా లాక్‌డౌన్ విధించడంతో పెద్ద ఎత్తున అనుమానాలు కలుగుతున్నాయి. మరలా ఏదైన కొత్త వైరస్ చైనా నుంచి దాడి చేయబోతుందేమో అని ఆందోళన చెందుతున్నాయి ప్రపంచదేశాలు.