కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. గత ఏడాది ఎస్పీ బాలు వంటి లెజెండ్ కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. తాజాగా తమిళ సినీ నటుడు, సీనియర్ కమెడియన్ వడివేలు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు.
Read Also: రివ్యూ : శ్యామ్ సింగరాయ్
ఇటీవల లండన్‌లో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని మూడు రోజుల కిందట ఇండియా వచ్చిన ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వడివేలును చికిత్స నిమిత్తం పోరూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే వడివేలు లండన్ నుంచి రావడంతో అధికారులు ఒమిక్రాన్ పరీక్షలు కూడా చేస్తున్నారు. శనివారం నాడు ఒమిక్రాన్ రిపోర్టులు వస్తాయని అధికారులు వెల్లడించారు.