యూపీలో ఎన్నికల వేడి రగులుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలను నిర్వహించారు. ఇక ఇదిలా ఉంటే, తాజాగా అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌కు కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా…
తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్నారని, వారదందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.దీంతో వారి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 9,122 మంది ప్రయాణికులు వచ్చారు.…
ఏపీలో గడిచిన 24 గంటల్లో 27,233 శాంపిల్స్‌ను పరీక్షించగా 95 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,75,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు (కృష్ణా జిల్లా) మరణించగా ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 14,481కి చేరింది. నిన్న 179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 20,60,061 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇంకా 1,432 కరోనా కేసులు యాక్టివ్‌గా…
దేశంలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. క్లబ్స్, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లలో 50% కెపాసిటీతోనే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని, డీజేకు అనుమతి లేదని స్పష్టం చేసింది. టీకా తీసుకోని వారికి వేడుకల్లో పాల్గొనేందుకు పర్మిషన్ ఉండదని తెలిపింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2022 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. Read Also: 20 యూట్యూబ్…
కరోనా తరువాత విశాఖలో విమానయాన రంగం సేవలు క్రమంగా పుంజుకుంటున్నాయి. స్పైస్ జెట్, స్కూట్ ఎయిర్ సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యాయి. జనవరి 1 నుంచి విశాఖ-తిరుపతి, కోల్‌కతా-విశాఖ స్పైస్ జెట్ విమానాలు నడవబోతున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 29 నుంచి విశాఖ-సింగపూర్ మధ్య స్కూట్ ఎయిర్ సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. Read: నేడు తణుకులో సీఎం జగన్ పర్యటన… దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాలను విమానయాన సంస్థలు ప్రారంభించింది. కరోనా మహమ్మారి సమయంలో ఈ సర్వీసులను…
తెలంగాణలో దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈనెల 16న దుబాయ్ నుంచి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో వెంటనే హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. టెస్టులు నిర్వహించగా అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. Read Also:…
ప్రపంచం మొత్తం మీద ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డెల్టా నుంచి కోలుకోక ముందే ఒమిక్రాన్ వేరియంట్ ఎటాక్ చేస్తున్నది. శీతాకాలం కావడంతో సాధారణంగానే చలి తీవ్రత పెరిగింది. ఫలితంగా జ్వరం, తలనొప్పి వంటి వాటితో ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడినట్టు అనిపించినా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగినా భయపడిపోతాం. పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం. Read: భారత్‌లో జీరో…
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని నాదల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ ఈవెంట్లోపాల్గొని నాదల్ తన స్వదేశం స్పెయిన్కుచేరుకున్నాడు. ఈ సందర్భంగా చేసిన పరీక్షల్లో ఇతడికి కరోనా సోకినట్లు స్పష్టమైంది. దీంతో ‘నేను కొంత బాధలో ఉన్నాను. ఈ సమస్య నుంచి త్వరగా…