కోవిడ్ తగ్గేలాలేదు..!-డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఫస్ట్ వేవ్ కలవరపెడితే.. సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలు తీసింది.. ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైపోయింది.. భారత్‌లోనూ వచ్చే నెలలోనే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.. ఇంకా, సెకండ్ వేవ్ ముప్పు పోలేదని ఇప్పటికే భారత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక, తాజా పరిస్థితిలపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. చాలా దేశాల్లో డెల్టా వేరియంట్‌తో కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తగ్గలేదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని అంటోంది.. పలు దేశాల్లో వ్యాక్సిన్లు.. తీవ్రమైన కేసులు, ఆస్పత్రులకు వెళ్లడాన్ని తగ్గిస్తున్నా.. ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడుతూనే ఉందని తెలిపారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్.. మృతుల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనూ నమోదు అవుతుందన్నారు.. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 5 లక్షల కొత్త కేసులు వెలుగు చూస్తే.. దాదాపు 9,300 మంది మృతిచెందారని పేర్కొన్న ఆమె.. ఆఫ్రికాలో గత రెండు వారాలుగా కొత్త కేసుల్లో 30 నుంచి 40శాతం వృద్ధి కనిపిస్తోందన్నారు.. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను గమనిస్తే.. ‘కరోనా.. తగ్గే మహమ్మారి’లా కనిపించడం లేదనే అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు సౌమ్య స్వామినాథన్.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!