ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. దీంతో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతున్నది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నిబంధనలు సడలించారు. అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, కరోనా కేసులు తగ్గుతున్నా, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు. Read: హారర్ మూవీ ఫస్ట్ లుక్ తో హీట్ పెంచేస్తున్న జాక్వెలిన్ వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చినా,…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. కేరళలో ఇంకా భారీగానే పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. కేరళ సర్కార్ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 13,772 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 142 మంది మరణించారు.. ఇదే సమయంలో 11,414 మంది కరోనా బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,25,466కు చేరుకోగా.. రికవరీ కేసులు 29,00,600కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు…
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన తొలిసారి సమావేశమైన కొత్త కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. రూ.23,132 కోట్ల కరోనా నిర్వహణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. బుధవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా… రాత్రి శాఖలు కేటాయించారు ప్రధాని మోడీ.. ఇక, ఇవాళ సమావేశమైన కేంద్ర కొత్త మంత్రివర్గం.. కరోనా తాజా పరిస్థితులు, థర్డ్ వేవ్ ఎదుర్కోవడంపై చర్చించింది.. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొవడంతోపాటు, థర్డ్ వేవ్‌కు సన్నద్ధమయ్యేందుకు కొత్త అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ కింద రూ.23,132…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,070 సాంపిల్స్ పరీక్షించగా… 2,982 మందికి పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారితో మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే, సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 3,461 మంది కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,14,213కు చేరుకోగా… రికవరీ కేసులు 18,69,417కు పెరిగింది.. ఇక, ఇప్పటి…
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేస్తూ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే… మారిన ఈ కర్ఫ్యూ టైమింగ్స్ ఇవాళ్టి నుంచి అమలు కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది… read also : కిషన్ రెడ్డికి బంపర్…
కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా కిందికి దిగి వస్తుండడంతో… కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది… ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలు యథావిథిగా నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. కోవిడ్ నిబంధనలు…
తెలంగాణలో కరోనా పాజిటివ్ రోజువారి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,10,141 సాంపిల్స్ పరీక్షించగా.. 772 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఏడుగురు కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 748 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,29,054కు చేరగా.. రికవరీ కేసులు 6,13,872 కు…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది. తాజాగా రాష్ట్రంలో 3,166 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,11,231 కి చేరింది. ఇందులో 18,65,956 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 32,356 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 20 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,919 కి చేరింది. ఇకపోతే గడిచిన…
వైజాగ్ అంటేనే టూరిజానికి కేరాఫ్ అడ్రస్. బీచ్, అరకు లోయలు, ఏజెన్సీ ప్రాంతాలు, జలపాతాల సందడి… టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తాయి. సాధారణ రోజుల్లో కంటే సీజనల్ డేస్ లో పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతుంటాయి. అలాంటి టూరిజంపై కరోనా ప్రభావం పడింది. విశాఖలో ట్రావెల్స్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారు అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 700 పైగా చిన్నా చితకా ట్రావెల్ ఏజెన్సీ లు ఉన్నాయ్. కరోనా వల్ల గత ఏడాది నుంచి వ్యాపారం సాగకపోవడంతో…
కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పూర్తి స్థాయిలో అన్‌లాక్ చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 19 తరువాత ఆంక్షలన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తోంది బోరిస్ సర్కార్. గత ఏడాదిగా కాలంగా కరోనా మహమ్మారితో విలవిల్లాడిన యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ముఖ్యంగా కరోనా పుట్టాక పలు వేరియంట్లతో వణికిన బ్రిటన్‌లో.. ఇప్పుడు కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో అన్నింటిని ఓపెన్ చేసేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా…