కోవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై ప్రపంచ ఆరోగ్యసంస్థ సంతృప్తి వ్యక్తం చేసింది.త్వరలోనే ఎమర్జెన్సీ వినియోగానికి సంబంధించి అనుమతులు మంజూరు చేయనుంది. మరోవైపు.. భారత్ తన జనాబాలో 60 నుంచి 70శాతానికి వ్యాక్సీన్ వేయడం అత్యవసరమని who స్పష్టం చేసింది. హైదరాబాద్ బేస్డ్ వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్‌కు .. ప్రపంచ ఆరోగ్యసంస్థ శుభవార్త అందించింది. ఇప్పటికీ WHO అనుమతుల కోసం వేచి చూస్తున్న కోవాగ్జిన్‌కు.. త్వరలోనే అత్యవసర వినియోగానికి సంబంధించి, అనుమతులు మంజూరు చేయనుంది.
read also : జిల్లాల పర్యటనకు బండి సంజయ్
కోవాగ్జిన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది WHO. కోవాగ్జిన్ ఫైనల్ పేస్ ట్రయల్ డేటా.. అంతర్జాతీయ ప్రజారోగ్యానికి సంబంధించి చక్కగా ప్రభావం చూపిస్తోందని తెలిపింది. జూన్ 23న భారత్ బయోటెక్, WHO మధ్య ప్రీ సబ్‌మిషన్ మీటింగ్ జరిగింది. డెల్టా వేరియంట్‌కు సంబంధించి కోవాగ్జిన్ పనితీరు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. ఓవరాల్ పనితీరు చూస్తే చాలా ఉన్నతంగా ఉందని తెలిపింది. గత శనివారం కోవాగ్జిన్ పనితీరును ప్రకటన విడుదల చేసింది భారత బయోటెక్.
దీనిపనితీరు ఓవరాల్‌గా చూస్తే, 77.8 శాతంగా ఉందని తెలిపింది. కోవిడ్ 19 తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో.. 93.4శాతం ప్రభావాన్ని కనబర్చిందని తెలిపింది. అయితే , డెల్టా స్ట్రెయిన్ విషయంలో మాత్రం 65.2శాతం ఉన్నట్లు తేల్చి చెప్పింది. భారత ప్రభుత్వం , ప్రజల్లో ప్రైమరీ రోగనిరోధక శక్తి పెంచడంపై దృష్టి సారించాలని WHO సూచించింది. తన జనాబాలో 60 నుంచి 70 శాతం మందికి వ్యాక్సినేషన్ చేయాలని స్పష్టం చేసింది.