కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. రోజుకు 40 లక్షల వరకు టీకాలు వేస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్-అక్టోబర్ కాలంలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో డిసెంబర్ చివరినాటికి దేశంలోని 18 ఏళ్లు నిండిన వారందరికి వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. అంటే ప్రతిరోజు 80 లక్షల వరకు టీకాలు అందించాలి.
Read: ‘భాయ్ జాన్’పై బిజినెస్ మ్యాన్ కేసు! కంప్లైంట్ లో సల్మాన్ చెల్లెలి పేరు కూడా…
రోజుకు 80 లక్షల టీకాలు అందించాలంటే వ్యాక్సినేషన్ సెంటర్ల సంఖ్యను గణనీయంగా పెంచాలి. మే నెలలో 2.5 కోట్ల టీకాలు అందించగా, జూన్ వరకు ఆ సంఖ్య 10 కోట్లకు చేరిందని, జులై నెలలో 16 నుంచి 18 కోట్ల టీకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, టీకాల కోరత ప్రస్తుతానికిలేదని, అయితే, టీకాలను ప్రజలకు పంపిణీ చేయడమే అసలైన సవాల్ అని వ్యాక్సిన్ నిపుణుల కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.కె అరోరా పేర్కొన్నారు. జులై నెలలో 12 కోట్ల టీకాలను అందుబాటులో ఉంచినట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.