
ఇండియాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండే, దేశంలో కొత్తగా 3,48,421 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40,938కి చేరింది. ఇందులో 1,93,82,642 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,04,099 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 4205 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,54,197కి చేరింది.