ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 4,14,188 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,14,91,598కి చేరింది. ఇందులో 1,76,12,351 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,45,164 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24గంటల్లో ఇండియాలో కరోనాతో 3915 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,34,083కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,31,507 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 16,49,73,058 మందికి వ్యాక్సిన్ అందించారు.