కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో భారత్ వణికిపోయింది… మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందన్న నిపుణుల హెచ్చరికలు అందరినీ భయపెడుతున్నాయి.. ఫస్ట్ వేవ్‌లో అనారోగ్యసమస్యలతో ఉన్నవారు ఇబ్బంది పడితే, సెకండ్ వేవ్‌లో యువతను కూడా వదలలేదు మహమ్మారి.. ఇక, థర్డ్ వేవ్‌లో చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.. అయితే, థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని చెప్పలేమని.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లోనూ చాలా మంది చిన్నారులకు కోవిడ్ బారినపడ్డారని ఎయిమ్స్ ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అయిపోయింది.. కానీ, చిన్నారులు మాస్క్ ధరించవచ్చా..? ఏ వయస్సు వారు మాస్క్ ధరించాలనే అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో పిల్లలు మాస్కు ధరించడంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది.
చిన్నారుల్లో ఏ ఏజ్ గ్రూప్ మాస్క్ ధరించాలి అనేదానిపై మార్గదర్శకాలను విడుదల చేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్).. ఇక ఆ మార్గదర్శకాలను పరిశీలస్ఇతే.. ఐదేళ్ల లోపు చిన్నారులు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.. 6-11 ఏళ్ల మధ్య వయసు పిల్లలు మాస్కులను సురక్షితంగా వాడగలిగే సామర్థ్యాన్ని బట్టి ధరించాలని.. తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలో పిల్లలు మాస్కులు ధరిస్తే మంచిదని పేర్కొంది.. ఇక 12-17 ఏళ్ల పిల్లలు… పెద్దవారి మాదిరిగానే తప్పకుండా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది.. అంతేకాదు.. మాస్కులను వాడే సమయంలో చేతులను సబ్బుతో కడుక్కోవడం, లేదా శానిటైజర్‌తో శుభ్రపరచుకోవడం తప్పనిసరి అని పేర్కొంది డీజీహెచ్‌ఎస్.