ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్న… కరోనా మంతనాలు మాత్రం తగ్గడం లేదు. దేశంలో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,59,155 కి చేరింది. ఇందులో 2,79,11,384 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,80,690 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,002 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,67,081 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,21,311 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 24,96,00,304 మందికి వ్యాక్సిన్ అందించారు.