కరోనా మహమ్మారి కట్టడి కోసం కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ లాంటి ఆంక్షలు విధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా సడలింపులు ఇస్తూ వచ్చింది.. అయితే, నైట్ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతూనే ఉంది… తాజాగా మరోసారి నైట్ కర్ఫ్యూను పొడిగించింది ఏపీ ప్రభుత్వం… ఈ నెలాఖరు వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది… అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కోవిడ్ ఆంక్షల్లో భాగంగా నైట్ కర్ఫ్యూ అమల్లో…
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.. కొన్ని సార్లు ప్రత్యేక డ్రైవ్ ద్వారా విస్తృతంగా వ్యాక్సిన్ వేస్తున్నారు అధికారులు.. అయితే, బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో మరికొన్ని రోజులు వ్యాక్సినేషన్‌కు సెలవులు ప్రకటించారు అధికారులు.. రేపు అనగా 14వ తేదీన వాక్సినేషన్ కు సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు, 14వ తేదీన వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,786 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 517 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో 826 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.…
ఖాజాగుడాలో మెగా వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించారు సీఎస్ సోమేశ్ కుమార్. ఈరోజు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు వ్యాక్సిన్ డ్రైవ్ జరగనుంది. ఎవరు ఎక్కువ సేపు వేయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఏర్పాటు చేసారు. ఇంతకాలంగా వ్యాక్సిన్ ఇస్తున్నాము… ఎక్కడా తీవ్ర అనారోగ్యాలకు ఎవరు గురి కాలేదు. ఖాజాగుడా ప్రాంతలో ఎక్కువగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మైగ్రేషన్ సిబ్బంది ఎక్కువగా పని చేస్తుంటారు. మైగ్రేషన్ వర్కర్ లకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. 2.8 కోట్ల…
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ భారీగా తగ్గింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 181 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 26,579 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,14,900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ కేసుల సంఖ్య 3,33,20,057 కు…
కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఇక మహమ్మారి పని అయిపోయిందని భావించి అంతా కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేశారు.. నో మాస్క్, నో సోషల్ డిస్టెన్స్ అనే తరహాలో ప్రవర్తించారు ప్రజలు.. దీంతో.. సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టించింది.. మళ్లీ కేసులు తగ్గుముఖం పడుతునున్నాయి.. పండుగల సీజన్ ప్రారంభమైంది.. మళ్లీ గుంపులుగా చేరుతున్నారు.. అంతా కలుసుకుంటున్నారు. ఇదే సమయంలో.. కోవిడ్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారని ఓ సర్వే చెబుతోంది.. కేంద్ర ప్రభుత్వం సైతం కొవిడ్…
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33,506 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 162 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో వ్యక్తి కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 214 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,67,877 కి చేరగా.. రికవరీ కేసులు…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఇప్పుడు అంతా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. అయితే, ఇంకా కొందరిలో అపోహలు ఉన్నాయి.. వారి అపోహలు వీడి వ్యాక్సిన్ కోసం అడుగులు వేసేలే.. పలు సంస్థలు రకరకాల స్కీమ్‌లను ప్రవేశ పెడుతున్నాయి. ఇందులో భాగంగా గుజరాత్‌లోని అమ్‌వాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) కొత్తగా ఓ ఆఫర్ తీసుకొచ్చింది… వ్యాక్సినేషన్‌కు, పండుగకు లింక్ చేసి.. మరీ ఆఫర్ ప్రకటించింది ఏఎంసీ.. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటే లీటర్ వంట నూనె ప్యాకెట్ ఉచితంగా…
తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య మరింత కిందకు దిగివచ్చింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,166 శాంపిల్స్ పరీక్షించగా.. 190 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ మరో వ్యక్తులు కోవిడ్ బారినపడి మృతిచెందగా.. 245 మంది కరోనాబాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,67,725 కు చేరగా.. రికవరీ కేసులు 6,59,508 కి పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,235 శాంపిల్స్ పరీక్షించగా.. 693 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 6 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 927 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,86,60,811 కు…