ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ భారీగా తగ్గింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 181 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 26,579 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,14,900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ కేసుల సంఖ్య 3,33,20,057 కు పెరగగా.. కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,50,963 కు చేరింది.. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 65,86,092 టీకా డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 95,89,78,049 డోసులు వేసినట్టు తెలిపింది కేంద్రం.