కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో విస్తృతంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో.. సోషల్ మీడియా వేదికగా కొందరు ఫేక్‌గాళ్లు.. వ్యాక్సినేషన్‌పై తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు. ఇది నిజమా..? అబద్ధమా..? అని నిర్ధారణకు రాకుండానే.. చాలా మంది లైక్‌లు, షేర్లతో అది కాస్త వైరల్ చేస్తున్నారు. తాజాగా.. వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల (నవంబర్ 1వ తేదీ) నుంచి రేషన్, పింఛన్ నిలిపివేసే ఆలోచనలో వైద్యారోగ్య శాఖ ఉందంటూ..…
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎనిమిది నెలల కనిష్టానికి కేసులు తగ్గాయి. ఇది సంతోషించాల్సిన విషయం. ఐతే, థర్డ్ వేవ్ భయాలు మాత్రం మనల్ని వీడలేదు. మరోసారి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో భయాలు కూడా ఎక్కువవుతున్నాయి. బ్రిటన్,రష్యా, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలలో కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. ఇది ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌ను ఇప్పుడు థర్డ్ భయం వెంటాడుతోంది. ఇప్పటికే మన దేశంలో ప్రారంభమైందని కొందరు…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా కోవిడ్ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఆక్సిజన్ సిలిండర్లను యుద్ధ విమానాల ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడంతో కోవిడ్ మరణాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ప్రజలంతా కోవిడ్ పై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండటంతో అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కట్టడిలోకి వచ్చింది. అయితే భారత్…
బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మరణంతో ఏపీలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో వైసీపీ తరుఫున దివంగత బద్వేల్ మాజీ ఎమ్మెల్యే సతీమణి బరిలో ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉండటంతో ఇక్కడ వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకే అన్న చందంగా మారింది. ఓటమిని ముందుగానే గుర్తించిన టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నాయి. అనుహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ రేసులో నిలువడంతో ఎన్నిక అనివార్యమైంది.…
కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దుచేసిన ప్రభుత్వం మళ్ళీ పరీక్షలకు సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షల నిర్వహణలో విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంది ఇంటర్ విద్య జే.ఏ.సి. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేస్తూ, పరిస్థితులు చక్కబడిన తర్వాత ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఇంటర్ బోర్డు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే…
కరోనా ఎంట్రీతో ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులో లేని సమయంలో చాలాదేశాలు ఈ మహమ్మరి బారినపడి కుదేలయ్యాయి. ముఖ్యంగా అగ్ర రాజ్యాలైన అమెరికా, ఇటలీ, బ్రిటన్, చైనా, తదితర దేశాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాయి. ఈ దేశాల్లో కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కరోనా తొలివేవ్ గా గుర్తించిన ఈ సమయంలో లక్షలాది మంది అమాయక ప్రజలు కరోనాతో మృత్యువాతపడగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. …
ఏపీలో కరోనా క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,494 శాంపిల్స్ పరీక్షించగా.. 478 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 574 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు కరోనా టెస్ట్‌ల సంఖ్య 2,91,85,656 కు పెరిగింది.. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,62,781 కు పెరగగా.. రివకరీ…
భారత్‌లో టీకా కార్యక్రమం వేగంగా సాగుతున్నది. ఇప్పటికే 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. త్వరలోనే దేశంలో అర్హులైన అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది భారత ప్రభుత్వం. అయితే, చిన్నారులకు సంబంధించి వ్యాక్సినేషన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేసిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా వ్యాక్సినేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో మరింత వేగంగా డోసుల కార్యక్రమం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం…
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తాను భారతీయురాలిగా గర్వపడుతున్నాను అని తెలిపారు. 100 కోట్లా టీకా డోస్ లు పంపిణీ మార్క్ ని చేరడం సంతోషంగా ఉంది. ఈ విజయం వైద్యులు, మెడికల్ ప్రొఫెషనల్స్ ది, ఈ సందర్భంగా ప్రధాని మోదికి కృతజ్ఞతలు. ఈ విజయంతో అనేక దేశాలు మన వైపు చూస్తున్నాయి. భారత్ లాంటి జనభా ఎక్కువగా వున్న దేశాలు ఇలాంటి విజయం సాధించడం నిజంగా అంత సులభం కాదు. స్వదేశంలో తయారైన వ్యాక్సిన్…
కరోనా కట్టడికి వ్యాక్సిన్ మాత్రమే శ్రీరామ రక్ష అని నిపుణులు పదే పదే చెప్పుతున్నారు. ముఖ్యంగా రెండు డోసుల వాక్సిన్ వేసుకున్న వాళ్లు కరోనా నుంచి 99 శాతం రక్షణ పొందుతున్నారని సర్వేలు తేల్చాయి. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది వాక్సిన్ తీసుకొని వారే ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అంతేకాక మొదటి డోస్ మాత్రమే తీసుకున్న వారిలో 30 శాతం మందికి కరోనా వస్తోందని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 3…