కరోనా మహమ్మారి కట్టడి కోసం కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ లాంటి ఆంక్షలు విధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా సడలింపులు ఇస్తూ వచ్చింది.. అయితే, నైట్ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతూనే ఉంది… తాజాగా మరోసారి నైట్ కర్ఫ్యూను పొడిగించింది ఏపీ ప్రభుత్వం… ఈ నెలాఖరు వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది… అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కోవిడ్ ఆంక్షల్లో భాగంగా నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.