ఖాజాగుడాలో మెగా వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించారు సీఎస్ సోమేశ్ కుమార్. ఈరోజు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు వ్యాక్సిన్ డ్రైవ్ జరగనుంది. ఎవరు ఎక్కువ సేపు వేయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఏర్పాటు చేసారు. ఇంతకాలంగా వ్యాక్సిన్ ఇస్తున్నాము… ఎక్కడా తీవ్ర అనారోగ్యాలకు ఎవరు గురి కాలేదు. ఖాజాగుడా ప్రాంతలో ఎక్కువగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మైగ్రేషన్ సిబ్బంది ఎక్కువగా పని చేస్తుంటారు. మైగ్రేషన్ వర్కర్ లకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. 2.8 కోట్ల డోస్ లు ఇప్పటి వరకు రాష్ట్రంలో పంపిణీ చేసాము. వచ్చే నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100% మొదటి డోస్ పూర్తి చేయగలం అని తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ లు ఏర్పాటు చేస్తున్నాము. వాక్సినేషన్ తక్కువగా జరిగిన ప్రాంతాల్లో కలెక్టర్ లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాము అని పేర్కొన్నారు సీఎస్ సోమేశ్ కుమార్.