కరోనా వైరస్ కి పుట్టినిల్లయిన చైనాలో మళ్ళీ ఆ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. మిగతా దేశాల్లో ఆంక్షలు సడలించి అన్నిటికీ పర్మిషన్లు ఇస్తున్నాయి. కానీ, చైనాలో మాత్రం మళ్ళీ వైరస్ కట్టడికి చర్యలు చేపడుతున్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళినవారు తిరిగి వస్తే ఖచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలంటున్నారు. వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వైద్య అధికారులు ఆదేశించారు. కొవిడ్ కేసులను సున్నా స్థాయికి పరిమితం చేసేందుకు ఈ మేరకు చర్యలు…
భారత్‌లో దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను విస్తృతంగా పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిషీల్డ్‌కు అనుమతి ఇచ్చినా.. కోవాగ్జిన్‌కు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. దీంతో.. ఆ వ్యాక్సిన్ తీసుకున్నవారి విదేశీ పర్యటలనపై తీవ్ర ప్రభావం పడింది.. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు కోవాగ్జిన్ తీసుకున్నవారికి కూడా తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతిఇస్తుండగా.. మరికొన్ని దేశాలు మాత్రం.. డబ్ల్యూహెచ్‌వో ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి.. అయితే, భారత్ బయోటెక్…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గత బులెటిన్ కంటే.. ఇవాళ కాస్త తక్కువ వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,848 శాంపిల్స్ పరీక్షించగా.. 385 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 675 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,95,18,787 కరోనా నిర్ధారణ పరీక్షలు…
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినా ఎవరూ అజాగ్రత్తగా వుండవద్దన్నారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్. కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రాజేంద్రనగర్‌లో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సీఎస్ పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు ఇచ్చామని, నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు…
కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నది. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పట్టిన మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులో కొత్త రూపంలో పెరుగుతున్నాయి. మళ్లీ లాక్‌డౌన్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు వాడకం పెరుగుతున్నది. అయితే, శరీరంపైన, దుస్తులపైనా ఉండే కరోనా మహమ్మారిని అంతం చేసే యంత్రాలపై పరిశోధకులు దృష్టిసారించారు. పాట్నా ఐఐటీకి చెందిన పరిశోధకులు ఫుల్ బాడీ డిసిన్ఫెక్ట్ యంత్రాన్ని తయారు చేశారు. ఈ ఫుల్ బాడీ డిసిన్ఫెక్ట్ యంత్రం ఏర్పాటు చేసిన…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,604 శాంపిల్స్ పరీక్షించగా.. 481 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదే సమయంలో 385 మంది పూర్థిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా టెస్ట్‌లతో కలుపుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,94,43,885 కు చేరింది. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,46,841 కి…
గత రెండేళ్లుగా ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన కరోనా ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నది. రష్యా, చైనా, న్యూజిలాండ్, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. రష్యాలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. నిన్నటి రోజున రష్యాలో ఏకంగా 40,096 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 1159 మంది కరోనాతో మృతి చెందారు. రష్యాలో అత్యధికంగా నమోదైన కేసులు ఇవేనని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. అక్టోబర్ 30 వ తేదీ…
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఏకంగా 3 వేల వరకు కేసులు పెరిగాయి.. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,156 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 733 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 17,095 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇక, తాజాగా 12,90,900 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.. దీంతో.. ఇప్పటి…
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గినా.. ఇతర దేశాల్లో మళ్లీ భారీగా కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో.. థర్డ్ వేవ్ తప్పదా? అనే ఆందోళనకు నెలకొన్నాయి.. ఓవైపు కోవిడ్ పోయిందనే భావనతో నిబంధనలు సడలిస్తూ వస్తున్న సమయంలో.. మళ్లీ మహమ్మారి విరుచుకుపడుతుందేమోన్న టెన్షన్ వెంటాడుతోంది. ఇక, కరోనా బారినపడుతున్నవారిలో యువతే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 20 ఏళ్లలోపు యువతే 90,561 మంది ఉన్నారని పేర్కొంది. పదేళ్లలోపు…