కొత్త వేరియంట్లతో ప్రమాదం లేనట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఎంట్రీతో ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులో లేని సమయంలో చాలాదేశాలు ఈ మహమ్మరి బారినపడి కుదేలయ్యాయి. ముఖ్యంగా అగ్ర రాజ్యాలైన అమెరికా, ఇటలీ, బ్రిటన్, చైనా, తదితర దేశాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాయి. ఈ దేశాల్లో కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కరోనా తొలివేవ్ గా గుర్తించిన ఈ సమయంలో లక్షలాది మంది అమాయక ప్రజలు కరోనాతో మృత్యువాతపడగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది.
కరోనా తొలివేవ్ ను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఇతర దేశాల్లో కరోనా మరణాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా కేసులు తక్కువగా నమోదు కావడంతో మరణాల సంఖ్య తక్కువగానే కన్పించింది. అయితే లాక్డౌన్ కారణంగా ప్రజారవాణా స్తంభించిపోవడంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా సాధారణ పరిస్థితి రావడానికి చాలానే సమయం పట్టింది.
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ఇక కరోనా సెకండ్ వేవ్ భారత్ ను ఊహించిన విధంగా దెబ్బతీసింది. ఈ సమయంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతోపాటు మరణాలు సంఖ్య కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లు అందరికీ అందుబాటులో లేకపోవడంతో మరణాలు ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ సరఫరాకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీని కేంద్రం వేగవంతం చేసింది. దీంతో భారత్ లో ప్రస్తుతం కరోనా కట్టడిలో ఉంది.
కరోనా రెండో దశలో డెల్టా ప్లస్ వైరస్ తీవ్ర విధ్వంసం సృష్టించింది. నాటి నుంచి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ సహకారంతో సీసీఎంబీ కరోనా వైరస్ ల ఆర్ఎన్ఏ జన్యు పరిణామ క్రమంపై నిరంతరం పరిశోధనలను చేపడుతోంది. అయితే కొత్త వేరియంట్లతో ప్రమాదం పొంచి ఉందని, థర్డ్ ముంపు ఉందని వస్తున్న వార్తలపై తాజాగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్, సలహాదారు రాకేష్ మిశ్రా స్పందించారు. తమ సంస్థ జరుపుతున్న జోనోమ్ సీక్వెనింగ్ పరీక్షల్లో సద్వేశంలో ఎలాంటి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. అయితే డెల్టా వేరియంట్లోనే సబ్ వేరియంట్లు కన్పిస్తున్నాయని పేర్కొన్నారు.
డేల్టా వేరియంట్లలో ఏవై4, ఏవై-33, ఏవై-27 వంటి రకాలు కన్పిస్తున్నాయని తెలిపారు. కానీ వీటి తీవ్రత చాలా తక్కువగా ఉందన్నారు. వాస్తవానికి విదేశాల్లో డెల్లా ప్లస్ వేరియంట్ ప్రభావం ఎక్కువ ఉందని ఆయన విశ్లేషించారు. మనదేశంలో ఎక్కువగా ఉండన్నారు. బెంగుళూరు తదితర నగరాల్లో సీవరేజి వాటర్ తోపాటు ఇతర నమునాలను పరిశీలించినపుడు కరోనా వ్యాప్తి తగ్గినట్లు తేలిందన్నారు. త్వరలోనే హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడవ దశ మురుగునీటి సర్వేను చేపట్టనున్నారని తెలిపారు. ప్రస్తుతం చిన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం శుభసూచకమన్నారు. డిసెంబర్ వరకు ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించినట్లయితే థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్లేనని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!