ఏపీలో కరోనా క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,494 శాంపిల్స్ పరీక్షించగా.. 478 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 574 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు కరోనా టెస్ట్‌ల సంఖ్య 2,91,85,656 కు పెరిగింది.. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,62,781 కు పెరగగా.. రివకరీ కేసులు 20,43,50 కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 14,333 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,398 గా ఉంది.