అలర్ట్.. అలర్ట్.. చిన్నారుల నుంచి పెద్దలకు కరోనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా కోవిడ్ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఆక్సిజన్ సిలిండర్లను యుద్ధ విమానాల ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడంతో కోవిడ్ మరణాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ప్రజలంతా కోవిడ్ పై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండటంతో అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కట్టడిలోకి వచ్చింది.
అయితే భారత్ కు కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందనే వార్తలు కొద్దిరోజులుగా బలంగా విన్పిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అలాగే కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులోకి రావడంతో టీకాల పంపిణీ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల దేశంలో వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం దేశంలో 18ఏళ్లు నిండిన ప్రతీఒక్కరికి ఉచితంగా కోవిడ్ టీకాలను వేస్తున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
కరోనాపై అవగాహన ఉన్న ప్రజలంతా ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సినేషన్ ను పూర్తి చేసుకున్నారు. అయితే కొంతమంది ఇంకా కోవిడ్ టీకాను వేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ఇబ్బందికరంగా మారుతోంది. దేశ వ్యాప్తంగా 60శాతం మంది ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే థర్డ్ వేవ్ ముప్పును తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో నవంబర్ నెల దాటితేగానీ భారత్ లో థర్డ్ వేవ్ ప్రమాదం పూర్తిగా తొలగిపోయింది? లేనిది చెప్పలేమని వారంటున్నారు.
థర్డ్ వేవ్ కనుక వస్తే ఆ ప్రభావం చిన్నారులపై అధికంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో వారికి పెద్దగా ప్రమాదం ఏమి ఉందని వారంటున్నారు. కానీ వీరి నుంచి పెద్దలకు సోకే ప్రమాదం ఉంటుందని గుర్తుచేస్తున్నారు. యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండి పెద్దలను కాపాడుకోవాల్సి బాధ్యత ఉందనే అభిప్రాయాన్ని వారంతా వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. తద్వారా పెద్దలను కాపాడుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా పూర్తిగా దూరం కాలేదు. ఈ పరిస్థితుల్లో కోవిడ్ ను పూర్తిగా తరిమికొట్టాలంటే ప్రతీఒక్కరు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాల్సిందే. ఈ విషయంలో యువత, చిన్నారులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..