COVID-19: 2019లో చైనాలోని వూహాన్ నగరంలో ప్రారంభం అయిన కరోనా మహమ్మారి, ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. తన రూపాలను మార్చుకుంటూ ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని వణికించింది. ఇటీవలే కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా కోవిడ్ ఎమర్జెన్సీని ముగించింది.
కరోనా మొదటి సంవత్సరంలో దాదాపు 30 లక్షల మంది పిల్లలు నెలలు నిండకుండానే జన్మించారు. 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 13.40 కోట్ల మంది పిల్లలు నెలలు నిండకుండానే జన్మించారు. ఇలా జన్మించిన వారిని ప్రీమెచ్యూర్ అంటే అపరిపక్వ శిశువులు అంటారు.
Corona: దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దాదాపు వారం రోజులుగా కేసుల సంఖ్య 10వేలు దాటుతోంది. గత వారం కాస్త అదుపులో ఉందనుకోగానే ఈ వారం భారీగా విస్తరిస్తోంది.
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 12,193 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 42 మంది వైరస్ కు బలయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 67,556గా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,81,877కు చేరగా.. మృతుల సంఖ్య 8,31,300కు పెరిగింది.
Covid-19: భారతదేశంలో ప్రతీరోజూ 10 వేలకు అటూఇటూగా కోవిడ్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,692 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తంగా 19 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 9 మంది ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి చేరుకుంది. అయితే నిన్నటితో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య ఈ రోజు గణనీయంగా తగ్గింది. నిన్న ఒక్కరోజే…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 60 వేలు దాటింది. భారత్‌లోనూ కరోనా భయపెడుతోంది. రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
Covid Mock Drill: ఇక, కరోనా మాయం అయ్యింది.. సాధారణ పరిస్థితులు వచ్చాయని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. మళ్లీ మహమ్మారి కేసులు పెరుగుతూ టెన్షన్ పెడుతున్నాయి.. దేశవ్యాప్తంగా కోవిడ్.. మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. 24 గంటల్లోనే 5వేల 880 పాజిటివ్‌లు నిర్దారణ అయ్యాయి. పాజిటివిటీ రేటు దాదాపు 7శాతానికి చేరుకుంది. వారం రోజులుగా పాజిటివిటీ రేటు పెరుగుతుండటం కలవరపెడుతోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మళ్లీ నిబంధనలను అమలు చేస్తున్నాయ్.…
దేశంలో కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఢిల్లీలో ఈరోజు 509 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.