Long Covid Effect: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 తరువాత ప్రస్తుతం చాలా మంది లాంగ్ కోవిడ్‌తో బాధ పడుతున్నారు. ఇలా బాధపడటానికి ప్రధాన కారణం.. వారు గతంలో కొవిడ్-19 బారిన పడి ఉండటమే. కొవిడ్-19లో వచ్చిన వేరియంట్లలో ఒమిక్రాన్ వేరియంట్ తరువాత కరోనా బాధితుల్లో ప్రతి 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్ బయటపడుతోందని అమెరికా అధ్యయనంలో వెల్లడయింది. కోవిడ్ బారిన పడిన ప్రతి 10 మందిలో ఒకరు ఇప్పటికీ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయన నివేదిక తెలిపింది.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
లాంగ్ కొవిడ్‌లో భాగంగా మనుషులు చిన్న పనికే అలసిపోవడం, మెదడుపై ప్రభావం చూపడం, తల తిరిగడం, గ్యాస్ర్టిక్ సమస్యలు రావడం, గుండె దడ, సెక్స్‌పై ఆసక్తి ఉండకపోవడం, తరచు దాహం వేయడం వాటితోపాటు రుచి, వాసన తెలియకపోవడం లక్షణాలుగా ఉన్నాయి. వీటితోపాటు విపరీతమైన దగ్గు, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు లాంగ్ కోవిడ్ ఉన్న వారిలో కనిపిస్తున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకటించింది. కాగా, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.. క్రమంగా సాధారణ పరిస్థితులు వచ్చాయని భావిస్తున్నా.. ఇంకా కొన్ని దేశాలు కరోనాతో ఇబ్బంది పడుతూనే ఉన్నాయి.. ఇక, ఆర్థికంగా అన్ని రంగాలను, దేశాలను కూడా దెబ్బ కొట్టింది కరోనా మహమ్మారి.