Covid Symptoms Changed Again Amid Omicron Subvariant: మన భారతదేశంలో పరిస్థితులు యథావిథిగా మారడంతో.. కరోనా వైరస్ దాదాపు విడిచి వెళ్లిందని అంతా భావించారు. ఇక కరోనా భయం అవసరం లేదని భావించారు. కానీ.. అనూహ్యంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజుకు 6 వేలకు పైగా కరోనా కేసులు దాటుతుండటంతో.. ఆందోళనకరమైన వాతావరణం అలుముకుంది. దాని సబ్‌వేరియెంట్లు సైతం పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా.. కొవిడ్ ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ XBB.1.16 దేశంతో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని కారణంగానే పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని నిర్ధారించిన వైద్యులు.. అప్రమత్తగా ఉండాలని ప్రజల్ని సూచిస్తున్నారు.
Pakistan Crisis: పాకిస్తాన్‌పై మరో పిడుగు.. 2026 కల్లా రూ.63 వేల కోట్లు కట్టకపోతే..
ఇదిలావుండగా.. ఈ సబ్‌వేరియెంట్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని తాజాగా షాకింగ్ రిపోర్ట్ వెల్లడైంది. ఈ వేరియంట్ సోకిన పిల్లల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నట్టు తేలింది. ఈ వేరియెంట్ బారిన పడిన పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. గతంలో ఈ కొత్త లక్షణాలు ఉండేవి కావని వైద్యులు తెలిపారు. ఈ కొత్త లక్షణాలతో పాటు గతంలో మాదిరిగానే కోవిడ్ బాధితులకు హైఫీవర్, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే.. కొత్త లక్షణాల విషయంలో కలకలం రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిపై ప్రభుత్వం అప్రమత్తమైంది. అటు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ కొత్త వేరియెంట్‌పై పరిశోధనలు చేస్తున్నట్టు వెల్లడించింది.
Dowry: నీ బిడ్డ చనిపోయింది శవాన్ని తీసుకెళ్లండి.. అత్తకు అల్లుడు ఫోన్
మరోవైపు.. భారత్‌లో ఇప్పటివరకు 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌లు వెలుగులోకి వచ్చాయి. విదేశీ ప్రయాణికులకు టెస్ట్‌లు నిర్వహించినప్పుడు.. ఈ వేరియంట్‌లను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రీసెంట్‌గా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులతో సమావేశం అయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.