భారత్‌లో మళ్లీ కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.. మూడు రోజుల క్రితం పదివేలకు దిగువన ఉన్న కేసులు.. ఇవాళ ఏకంగా 22 వేల మార్క్‌ను కూడా దాటేశాయి… ఇక, భారత్‌లో కేసుల పెరుగుదల చాలా వేగంగా, పెద్ద సంఖ్యలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సెంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చేసిన హెచ్చరికలు కలకలం సృష్టిస్తున్నాయి.. ఈ సమయంలో.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. Read Also: భారత్‌లో కరోనా…
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 8,067 కేసులు నమోదయ్యాయి. భారీ స్థాయిలో కేసులు పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇక ముంబై నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. ముంబై నగరంలో కొత్తగా 5428 కేసులు నమోదయ్యాయి. రోజువారి కేసుల్లో పెరుగుదల 47 శాతం అధికంగా ఉన్నది. కరోనా కేసులతో పాటుగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. త్వరలోనే ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాను డామినెట్ చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read:…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక, విమానాల్లో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకొని నెగిటివ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ లేకుండా ప్రయాణం చేసేందుకు అవకాశంలేదు. ఇక ఇదిలా ఉంటే, అమెరికాలోని చికాగో నుంచి ఐస్‌లాండ్‌కు 159 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. విమాన ప్రయాణానికి ముందు ప్రయాణికులకు టెస్టులు చేశారు. Read: వైరల్: టైగర్ దెబ్బకు…
సినీ పరిశ్రమ పై కరోనా కోరలు చాస్తోంది. ఇప్పుడిప్పుడే థియేటర్లు రిలీజ్ అవుతున్నాయి అని సంబరపడుతున్నలోపే స్టారలందరు కరోనా బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక తాజాగా టాలీవుడ్ లోను కరోనా కాలుపెట్టింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “ఇటీవలే నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం…
కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందిస్తూ వస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, కరోనాను ఐదు రోజుల్లోనే కట్టడి చేయగట సామర్థ్యం ఉందని చెబుతున్న మోల్నుపిరావిల్ ఇండియా యాంటీ వైరల్ డ్రగ్ కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఇండియాలో ఈ మాత్రలు తయారు చేయడానికి 13 కంపెనీలు అనుమతి తీసుకోగా…
కరోనా మరోసారి విజృభిస్తుంది. మొన్నటివరకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అని ఆనందించేలోపు కేసులు ఒక్కసారిగా పెరగడం భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహేష్ వదిన, నమ్రతా అక్క అయినా శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. శిల్పా కూడా ఒకనాటి బాలీవుడ్ నటి. “హమ్”, “ఖుదా గవా” మరియు “ఆంఖేన్” వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన శిల్పా ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నారు. శిల్పాకు…
బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరసకు కరోనా బారిన పడుతున్నారు. నిన్నటికి నిన్న బోనీ కపూర్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో బాలీవుడ్ భామకు కరోనా పాజిటివ్ అని తేలింది. బాహుబలి చిత్రంలో మనోహరి సాంగ్ తో రచ్చ చేసిన నోరా ఫతేహి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది. ” హయ్…
దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఢిల్లీ, మహారాష్ట్రపై అధికంగా ఉన్నది. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసుల వృద్ధి 86శాతంగా ఉంటే, మహారాష్ట్రలో 82శాతంగా ఉంది. ఇక, మహారాష్ట్రలో కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం 252 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 945 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. Read: నిబంధనలు పాటించకుంటే……
అమెరికాలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి 8 వ తేదీన 2.94 లక్షల కేసులు నమదవ్వగా దాదాపు దానికి రెండింతల కేసులు యూఎస్‌లో ఈ ఒక్కరోజులో నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. జాన్ హోప్‌కిన్స్ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 5.12 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగం వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి మొదలయ్యాక ఈ స్థాయిలో…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. ఆరు నెలల కాలం నుంచి కనిష్టంగా నమోదవుతున్న కేసుల్లో అనూహ్యంగా వేగం పుంజుకుంది. వారం రోజుల నుంచి క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల అలజడితో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండగా, అదే బాటలో ఇప్పుడు చెన్నై కూడా పయనిస్తున్నది. గత రెండు మూడు రోజుల నుంచి కేసులు క్రమంగా పెరుగుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ…