తెలంగాణలో కరోనా పాజిటివిటి రేటు క్రమంగా పెరుగుతున్నది. వారం రోజుల వ్యవధిలో 0.5 శాతంగా ఉన్న పాజిటివిటి రేటు ఇప్పుడు 1 శాతానికి పెరిగింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. డిసెంబర్ 26 వ తేదీన రాష్ట్రంలో 109 కరోనా కేలసులు ఉండగా ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ 2022, జనవరి 1 వ తేదీకి 317కి చేరింది. రాబోయే రోజుల్లో కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు. వచ్చే నాలుగు వారాలు చాలా…
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, ఒమిక్రాన్ నుంచి 27 మంది కోలుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 52 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,82,215కి చేరింది. ఇందులో…
ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సౌతాఫ్రికాలో బయటపడిని ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. ఒమిక్రాన్ ధాటికి ప్రపంచ ఆరోగ్యం పడకేసింది. యూకే, ఫ్రాన్స్‌లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్‌లో రెండు లక్షలకు పైగా కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. ఇక యూఎస్‌లో రోజువారి కేసులు 5 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇందులో సగం వరకు ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం వలనే కేసులు…
కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. దక్షిణాదిన కేరళ రాష్ట్రంలో కొత్త కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్ ప్రభావం కారణంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేసుల పెరుగుదలతో ఆసుపత్రులపై క్రమంగా ఒత్తిడి పెరగడం ప్రారంభం అయింది. వెంటనే కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. Read: ఢిల్లీ,…
చిత్ర పరిశ్రమకు కరోనా దెబ్బ్బ మరోసారి గట్టిగా తగలనుందా ..? అంటే నిజమే అంటున్నాయి సినీ వర్గాలు. గతేడాది కరోనా వలన చిత్ర పరిశ్రమ కుదేలు అయిన సంగతి తెలిసిందే. థియేటర్లు మూయడం, షూటింగ్లు ఆగిపోవడం, ప్రముఖులు కరోనా బారిన పడడం ఇలా ఒకటేమిటి సినీ ఇండస్ట్రీకి చెప్పుకోలేనంత నష్టం వాటిల్లింది. ఇక ఈ ఏడాది అయినా కరోనా పోయి థియేటర్లు అవ్వడంతో చిత్ర పరిశ్రమ కోలుకొంటుంది అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో కరోనా థర్డ్ వేవ్…
2020 లో కరోనా మహమ్మారి ప్రపంచంలో వ్యాపించడం మొదలుపెట్టింది. చైనాలో 2019 డిసెంబర్‌లో బయటపడ్డ కరోనా, ఆ తరువాత ప్రపంచ దేశాలకు విస్తరించింది. చైనా నుంచి ఇటలీ, యూరప్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాలకు వ్యాపించింది. దాదాపుగా అన్ని దేశాల్లోనూ కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపించింది. 2021 వరకు ప్రపంచం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో కరోనా పూర్తిగా సమసిపోతుందని అనుకున్నారు. కానీ, రూటు మార్చి, రూపం మార్చుకొని డెల్టా రూపంలో, ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతున్నది.…
కరోనా సమయంలో భారత్ అనేక దేశాలకు మానవతా దృక్పదంలో సహాయం చేసింది. అమెరికాతో సహా అనేక దేశాలకు మందులను సప్లై చేసింది. కోవిడ్ మొదటి దశలో ఇండియా నుంచి మలేరియా మెడిసిన్‌ను వివిధ దేశాలకు ఉచితంగా సప్లై చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన తరువాత కూడా ఇండియా మిత్ర దేశాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను మానతవతా దృక్పధంలో అందించింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌కు 5 లక్షల కోవాగ్జిన్ డోసులను సరఫరా చేసింది.…
మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నది. ముంబైలో ఉదయం సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంది. రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో త్వరలోనే పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు మహారాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ థర్డ్ వేవ్‌పై చేసిన…
రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడం భయాందోళనలను కలిగిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమలో కరోనా చాప కింద నీరులా పాకుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కరోనా బారిన పడింది. బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ‘జెర్సీ’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ కరోనా బారిన పడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్…
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది.. తాజాగా 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.. ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.. ఇక, ఆ సమావేశాలు ముగిసిన తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలుతోంది.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల అనంతరం వీరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అజిత్ పవార్ తెలిపారు. అయితే,…