భారత్‌లో మళ్లీ కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.. మూడు రోజుల క్రితం పదివేలకు దిగువన ఉన్న కేసులు.. ఇవాళ ఏకంగా 22 వేల మార్క్‌ను కూడా దాటేశాయి… ఇక, భారత్‌లో కేసుల పెరుగుదల చాలా వేగంగా, పెద్ద సంఖ్యలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సెంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చేసిన హెచ్చరికలు కలకలం సృష్టిస్తున్నాయి.. ఈ సమయంలో.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.
Read Also: భారత్‌లో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కొత్త కేసులు
ఎవరైనా జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన లేకపోవడం, రుచి కోల్పోవడం, విరోచనాలు, అలసట లాంటి సమస్యలతో బాధ పడుతుంటే వారికి “కోవిడ్” సోకినట్లుగా అనుమానించాలని, అప్రమత్తం కావాలని సూచించింది.. ఈ లక్షణాలు ఉంటే.. ఆలస్యం చేయకుండా.. వెంటనే నిర్ధారణ కోసం కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది.. ఇక, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున.. మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది కేంద్రం.