అమెరికాలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి 8 వ తేదీన 2.94 లక్షల కేసులు నమదవ్వగా దాదాపు దానికి రెండింతల కేసులు యూఎస్‌లో ఈ ఒక్కరోజులో నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. జాన్ హోప్‌కిన్స్ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 5.12 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగం వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి మొదలయ్యాక ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి.
Read: చెన్నైలోనూ పెరుగుతున్న కేసులు… ఒకే వీధిలో మూడు కేసులుంటే…
రాబోయే రోజుల్లో ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా కేసులతో పాటుగా అమెరికాలో క్రమంగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా 1762 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్, బూస్టర్ డోసులు అందిస్తున్నా కేసులు భారీగా నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. కేసుల కట్టడికి మార్గాలను అన్వేషిస్తున్నారు.