కరోనా మరోసారి విజృభిస్తుంది. మొన్నటివరకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అని ఆనందించేలోపు కేసులు ఒక్కసారిగా పెరగడం భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహేష్ వదిన, నమ్రతా అక్క అయినా శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. శిల్పా కూడా ఒకనాటి బాలీవుడ్ నటి. “హమ్”, “ఖుదా గవా” మరియు “ఆంఖేన్” వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన శిల్పా ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నారు.
శిల్పాకు నమ్రత, మహేష్ లకు మధ్య ఎంతటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నమ్రత- మహేష్ ఈ పార్టీ చేసుకున్నా శిల్పా లేకుండా ఉండదు. ఇక గత నాలుగురోజుల నుంచి ఆమె కరోనాతో పోరాటం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. “ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి టీకాలు వేసుకోండి మరియు అన్ని నియమాలను అనుసరించండి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ కి నమ్రతా స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కామెంట్ పెట్టింది.