సినీ పరిశ్రమ పై కరోనా కోరలు చాస్తోంది. ఇప్పుడిప్పుడే థియేటర్లు రిలీజ్ అవుతున్నాయి అని సంబరపడుతున్నలోపే స్టారలందరు కరోనా బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక తాజాగా టాలీవుడ్ లోను కరోనా కాలుపెట్టింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
“ఇటీవలే నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఇంట్లోనే వైద్యులు చెప్పిన ప్రకారం చికిత్స తీసుకొంటున్నాను. వ్యాక్సిన్ వేయించుకున్నాక కూడా కరోనా దావానంలా వ్యాపిస్తోంది. దయచేసి అందరు మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండండి.. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న విశ్వక్ సేన్ అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా” అనే సినిమాలో నటిస్తున్నాడు.
#StaySafe #MaskUp pic.twitter.com/0wDyGqoQWt
— Vishwak Sen (@VishwakSenActor) December 31, 2021