ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, ప్రస్తుతం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.. ఏపీలో తాజాగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 16కు పెరిగింది.. ఇక, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. ఏపీలో గత 24 గంటల్లో 31,743 శాంపిల్స్ పరీక్షించగా.. 162 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇదే సమయంలో 186 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు..…
గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ కరోనా.. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుంచి తప్పించుకున్నాం అనుకొనేలోపు మరోసారి కరోనా కోరలు చాస్తోంది. చాప కింద నీరులా మారి ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తోంది. ఇక చిత్ర పరిశ్రమలో కరోనా కలకలం మళ్లీ మొదలయ్యింది. తాజాగా బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురికి కరోనా రావడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కొడుకు…
మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. కరోనా, ఒమిక్రాన్ నిబంధనలను పాటిస్తూ డిసెంబర్ 22 నుంచి 28 వరకు మొత్తం 5 రోజులపాటు సమావేశాలను నిర్వహించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నాగపూర్‌లో నిర్వహించాల్సి ఉన్నా, ఒమిక్రాన్ కారణంగా ఈ సమావేశాలను ముంబైలోనే నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల సమయంలో 50 మంది కరోనా బారిన పడినట్టు మహా ఉప ముఖ్యమంత్రి పవార్ తెలిపారు. మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్, మరో మంత్రి…
కరోనా మహమ్మారి మళ్ళీ వేగంగా వ్యాపిస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు ప్రజలు. అందుకే కరోనా తగ్గిపోయింది కదా అనే భ్రమలో ఉండకుండా మాస్క్, శానిటైజర్, సామజిక దూరం పాటించడం మంచిదని చెబుతున్నారు వైద్యులు. మరోమారు ప్రముఖ సినీ సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కరీనా కపూర్, ప్రగ్యా జైస్వాల్ వంటి స్టార్స్ కు కరోనా సోకగా… తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరోకు కరోనా పాజిటివ్ గా…
ప్రపంచం మొత్తం ఒమిక్రాన్, కరోనా మహమ్మారులతో అనేక ఇబ్బందులు పడుతున్నాయి. యూరప్, అమెరికా దేశాల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండటంతో యూరప్ దేశాల్లో ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ కు పుట్టినల్లైన చైనాలో కేసులు చాలా తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. అయినప్పటికీ అనేక నగరాల్లో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు, వూహన్ తరహా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నది. చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన జియాంగ్ నగరంలో కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.…
దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలపై అనేక రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించాయి. తాజాగా కేరళ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలు…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరిగిపోతుండటంతో అనేక దేశాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. యూరప్‌తో పాటుగా ఆస్ట్రేలియాలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలోని అత్యధిక జనాభా కలిగిని న్యూసౌత్‌వేల్స్‌లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో ఒక్కరోజులో 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. కరోనా కేసులతో పాటుగా ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది.…
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వంటి మహమ్మారులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది. వ్యాక్సిన్ కనుగొన్న తరువాత కేసులు తగ్గడం ప్రారంభించడంతో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రపంచదేశాలు నడుంబిగించాయి. వచ్చే ఏడాది వరకు ఆర్ధిక రంగం తిరిగి పుంజుకుంటుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బ్రిటీష్ కన్సల్టెన్సీ సంస్థ సెబ్ఆర్ వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా 2028 లో దాటిపోతుందని అనుకున్నా, 2030 వరకు దానికోసం…
ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,987 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 76,766కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 162 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 7,091 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.…