ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న చిన్న గొడవలతో తమ పార్టీలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం చూస్తే బాధేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తన పదవికి రాజీనామా కూడా చేస్తానన్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు దళితులపై పడుతున్నారని నారాయణస్వామి అన్నారు. వర్గాలుగా విడిపోయిన రెడ్లు ఏమైనా చేస్తారని అభిప్రాయపడ్డారు.…
నిర్మల్ జిల్లా పరిషత్ పాలన అదుపు తప్పుతోంది. నిర్మల్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా కొరిపెల్లి విజయలక్ష్మీ బాధ్యతలు చేపట్టారు. పేరుకు పదవి ఆమెదే అయినా మొత్తం యంత్రాంగాన్ని నడిపించేది ఆమె భర్త రాంకిషన్‌రెడ్డి. జెడ్పీ సీఈవోల నుంచి మండలాల్లో పనిచేసే ఎంపీడీవోలు సైతం తన ఆదేశాల మేరకు పనిచేయాలని రాంకిషన్‌రెడ్డి హుకుం జారీ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. తనకు తెలియకుండా ఏదైనా ఫైల్ కదిలితే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.…
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నిర్మాత బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియాలో ట్వీట్ వార్ నడుస్తోంది. శనివారం ఉదయం బండ్ల గణేష్ ట్వీట్‌తో మొదలైన ఈ యుద్ధం నాన్ స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ‘బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు.. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవు’ అంటూ బండ్ల…
తిరుపతిలో వైసీపీ జాబ్ మేళా సందర్భంగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపై బండ్ల గణేష్ ఫైర్ అయ్యాడు. ఒక వ్యక్తితో ఉన్న వైరాన్ని కులానికి ఆపాదిస్తే చెప్పుదెబ్బలు ఖాయమని హెచ్చరించాడు. కమ్మవారిని కులం పేరుతో తిట్టడం తగదని, చెల్లెల్ని అన్న నుంచి దూరం చేసిన దగుల్బాజీ అని విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ విమర్శలు చేశాడు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి విషసాయి అంటూ ఆరోపించాడు. అయితే బండ్ల గణేష్‌కు తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు..…
ఆ పదవి నుంచి ఎవరు ఉంటారో.. మరెవరు పోతారో తెలియదు. కోర్టు నిర్ణయం.. మెడమీద కత్తిలా వేళ్లాడుతోంది. కంటిపై కునుకు లేకుండా చేస్తోందట. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. హైకోర్టు విచారణతో సభ్యుల ఉలికిపాటు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా మారిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల పరిస్థితి. ప్రస్తుత రోజుల్లో టీటీడీ బోర్డులో సభ్యుడంటే ఆషామాషీ విషయం కాదు. ఎక్కడెక్కడ నుంచో సిఫారసులు వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలూ పోటీపడుతున్నారు. గతంలో…
ఐపీఎల్ మ్యాచ్‌లు నెమ్మదిగా రసపట్టును తలపిస్తున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్ తేలిపోయినా.. సూపర్ సండేనాడు జరిగిన రెండు మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించాయి. తొలుత ముంబై-ఢిల్లీ మ్యాచ్, అనంతరం బెంగళూరు-పంజాబ్ మ్యాచ్ ఉర్రూతలూగించాయి. ఈ రెండు మ్యాచ్‌లలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిపించాయి. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయేలా కనిపించగా.. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ పోరాడి తమ జట్టును గెలిపించారు. ముఖ్యంగా లలిత్ యాదవ్ 48 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ…
పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విప్లవవీరుడు భగత్‌సింగ్ ను ఎంతో ఆరాధిస్తాడు. ఎంతలా అంటే తన ప్రమాణస్వీకారానికి భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామాన్ని ఎంచుకున్నారు. బసంతి తలపాగా ధరించి అచ్చు భగత్‌సింగ్‌లా దర్శనమిచ్చారు. ఐతే, సీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ ఫొటోపై ఇప్పుడు వివాదం రేగింది. ఆ ఫొటోలో ఆయన బసంతి తలపాగా (పసుపు రంగు తలపాగ) ధరించి ఉంటమే వివాదానికి కారణం. ఆ ఫొటో ప్రామాణికతపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రకారుల ప్రకారం ఇది…
మేడారం సమ్మక్క సారలమ్మ పై తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో చిన్నజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వివాదంపై చినజీయర్ స్వామి వివరణ. మహిళల్ని ఆదరించాలని భావించేవాడిని. మహిళల్ని, దేవతల్ని చిన్నచూపుతో మాట్లాడతామని అనుకోవడం పొరపాటు. పూర్వాపరాలు చూడాలి. మధ్యలో ఒకదాన్ని చూపించి విమర్శించడం హాస్యాస్పదం అన్నారు చినజీయర్ స్వామి. ఇవాళ లక్ష్మీ దేవీ పుట్టిన రోజు. ఆగమ గ్రంథాలు ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయ వైదిక…
మానసిక ప్రశాంతత కోసం గుడికెళతారు భక్తులు. పూజారులు పూజలు చేసి భక్తులకు ప్రసాదం అందిస్తారు. కానీ పూజారులే భక్తులపై దాడి చేసిన ఘటన సికింద్రాబాద్ లో కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ పూజారులు భక్తుడిపై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. ఆలయాల్లో భక్తులకు భద్రత లేకపోతే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తుల పూజారులు దాడి చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దేవునికి…