వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నిర్మాత బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియాలో ట్వీట్ వార్ నడుస్తోంది. శనివారం ఉదయం బండ్ల గణేష్ ట్వీట్‌తో మొదలైన ఈ యుద్ధం నాన్ స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ‘బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు.. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవు’ అంటూ బండ్ల గణేష్‌ను విమర్శిస్తూ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘వెన్నుపోటు పేటెంటు నీ యజమాని చంద్రబాబుది. 28 ఏళ్లుగా చెక్కు చెదరని గిన్నెస్ రికార్డు. ఇంకో వందేళ్లయినా అది బాబు పేరనే ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? ప్రతి కుక్కా సింహం కావాలనుకుంటుంది. నీలాంటి వాడే భౌ..భౌమని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు. నీవు మర్చిపోయినట్టు నటిస్తున్నా సచిన్ జోషి మాత్రం నిన్ను జీవితాంతం వెంటాడుతుంటాడు. మూవీకి అతను ఫైనాన్స్ చేస్తే రైట్స్ నువ్వు అమ్ముకున్నావంట. చెప్పు తెగేలా కొట్టింది, ఫోన్ పగిలింది నిజమేనా బండ్లా? రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరీలను ఛీట్ చేసినా వదిలేశారు. అందరూ వాళ్లంత మంచోళ్లు కారు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
దీంతో విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇస్తూ బండ్ల గణేష్ మరో ట్వీట్ చేశాడు. గతంలో ఫోన్ పగిలిపోయిందని, చెప్పు తెగేలా కొట్టారని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. ఫోన్లు పగలడం, లాజిక్కులు చేయడం, సినిమాలు తీయడం తప్పు కాదని.. దేశాన్ని దోచుకోవడం, స్కాములు చేయడం, తప్పు పనులు చేయడం దొంగ పని అంటూ కౌంటర్ ఇచ్చాడు. తాను చాలా చిన్నవాడ్ని అని.. తన మీద ఏమున్నా కోర్టు ఊరుకోదని బండ్ల గణేష్ స్పష్టం చేశాడు. కానీ జనాన్ని మోసం చేయడం, ప్రభుత్వ సొమ్ము దోచుకోవడం, అడ్డంగా బుక్కై జైలుకెళ్లడం తప్పు అని దొంగ సాయి గుర్తుపెట్టుకోవాలని ఫైర్ అయ్యాడు.
చంద్రబాబు తన బాసు కాదని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చాడు. తాను ఎప్పటికీ తెలుగుదేశానికి చెందినవాడ్ని కాదన్నాడు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని అని.. ఆ విషయం వైఎస్ఆర్ ఆత్మ కేవీపీని అడిగితే తెలుస్తుందన్నాడు. ఎవడో చెప్పిన మాటల్ని విని దొంగసాయి ట్వీట్లు చేస్తున్నాడని.. తాను చంద్రబాబు మనిషినని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని బండ్ల గణేష్ విమర్శించాడు. తనకు బతుకునిచ్చింది పవన్ కల్యాణ్ అని.. ఆయన పట్ల కృతజ్ఞతతో ఉంటానన్నాడు. ‘నేను తల్లిదండ్రులకు పుట్టా. నీలాగా నీతిలేని బతుకు బతకను. రాజకీయాల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా నిజాయితీగా ఉంటా, ఒకరినే అభిమానిస్తా, ప్రాణంపోయేదాకా ఒకరితోనే తోడుంటా’ అంటూ బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో స్పందించాడు.
దొంగ సాయి ఫోన్లు పగలటం, లాజిక్కులు చేయడం, సినిమాలు తీయడం వ్యాపారం కాదు, తప్పు కాదు దొంగసాయి.. దేశాన్ని దోచుకోవడం, స్కాములు చేయడం, తప్పు పనులు చేయడం అది దొంగపని సాయి.. సినిమాలు తీయడం, వ్యవసాయం చేయడం, వ్యాపారాలు చేసుకోవడం తప్పుకాదు. జనాన్ని మోసం చేయడం,
— BANDLA GANESH. (@ganeshbandla) April 16, 2022