Nirmal Zilla Parishad: పదవి ఆమెది.. పెత్తనం ఆయనది..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ జిల్లా పరిషత్ పాలన అదుపు తప్పుతోంది. నిర్మల్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా కొరిపెల్లి విజయలక్ష్మీ బాధ్యతలు చేపట్టారు. పేరుకు పదవి ఆమెదే అయినా మొత్తం యంత్రాంగాన్ని నడిపించేది ఆమె భర్త రాంకిషన్‌రెడ్డి. జెడ్పీ సీఈవోల నుంచి మండలాల్లో పనిచేసే ఎంపీడీవోలు సైతం తన ఆదేశాల మేరకు పనిచేయాలని రాంకిషన్‌రెడ్డి హుకుం జారీ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. తనకు తెలియకుండా ఏదైనా ఫైల్ కదిలితే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో రాంకిషన్‌రెడ్డి జెడ్పీటీసీ కాకపోయినా తెగ హడావిడి చేశారని అధికారులే స్వయంగా ఆరోపించారు. ఛైర్‌పర్సన్ స్థానంలో ఓ ఎమ్మెల్సీకి రాంకిషన్‌రెడ్డే స్వయంగా సన్మానం చేశారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ విజయలక్ష్మీకి కేటాయించిన ఇద్దరు గన్‌మెన్‌లను రాంకిషన్‌రెడ్డి వినియోగించుకుంటున్నారు. జెడ్పీ ఛైర్‌పర్సన్‌ను మించేలా అధికారులను వెంటపెట్టుకుని పర్యటనలు చేస్తుండటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇటీవల జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల వ్యవహారాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. కొన్ని ఆస్పత్రులను సీజ్ చేయడంతో విజయలక్ష్మీ భర్త రంగంలోకి దిగారు. ఐఎంఏ అధ్యక్షుడు, కలెక్టర్ మధ్య రాజీ కుదిర్చినట్లు జిల్లాలో చర్చ నడుస్తోంది. జెడ్పీ పాలన వ్యవహారాల్లో చక్రం తిప్పడమే కాకుండా గన్‌మెన్‌లను దుర్వినియోగం చేస్తున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!