చీరకట్టులో నుదుటి బొట్టుతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటూ కనికట్టు చేసింది కొత్త పెళ్ళికూతురు నయనతార. కోరుకున్నవాడితో కొంగు ముడేసుకోగానే కళ్యాణచక్రవర్తి శ్రీనివాసుని దర్శనం చేసుకుంది. అసలే తిరుమల, ఆ పై భక్త జనసందోహం! వచ్చిందేమో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్! ఇక జనం నయన్ ను చూడటానికి ఎగబడకుండా ఉంటారా? చిత్రంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ‘ఫోటో షూట్’ కూడా సాగించింది నయన్. ఇదే పొరపాటు అనుకుంటే ఈ నవ వధువు కాళ్ళకు చెప్పులు వేసుకొని…
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ తరగతి గదిలో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ 23 మంది విద్యార్థినులు నిరసన తెలిపారు. దీంతో కాలేజీ యాజమాన్యం వారందరినీ వారంపాటు సస్పెండ్ చేసింది. విద్యార్థినులు వారం పాటు కాలేజీకి రాకుండా నిషేధం విధించింది. Corona Updates : కర్ణాటకలో మళ్లీ కరోనా కలవరం.. అయితే ఈ ఏడాది మార్చిలో హిజాబ్‌పై కర్ణాటక…
ఏపీలో తరచూ వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల యాన్యువల్ రిపోర్టులను గవర్నరుకు సమర్పించారు గౌతమ్ సవాంగ్. ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ తీసుకుంటున్న చర్యలని వివరించారు గౌతమ్ సవాంగ్. ఈసందర్భంగా గవర్నర్ పలు సూచనలు చేశారు. గ్రూప్-1 ఆభ్యర్థుల అభ్యంతరాలను గౌతమ్ సవాంగ్ వద్ద గవర్నర్ ప్రస్తావించినట్టు సమాచారం. అంతకుముందే గ్రూప్ వన్ అభ్యర్ధులు గవర్నర్…
నటి, నిర్మాత జీవిత రాజశేఖర్- గరుడ వేగా సినిమా నిర్మాతల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు.నిన్నటికి నిన్న జీవితా.. ‘శేఖర్’ సినిమా ప్రెస్ మీట్ లో గరుడవేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. నా కూతురు లేచిపోయింది కొందరు, మేము మోసం చేశామని మరికొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకండి.. మా…
చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పోటీ ఉండడం సహజమే.. అది ఆరోగ్యకరమైన పోటీనే కానీ హాని చేసేది కాదు. అయితే ఇది కాకుండా మరికొన్ని విభేదాలు స్టార్ హీరోల మధ్య ఉన్న విషయం అందరికి తెలిసిందే. అలాంటి విభేదాలు ఉన్న హీరోలు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్, స్టార్ హీరోయిన్ కాజోల్ భర్త, హీరో అజయ్ దేవగన్. వీరిద్దరి మధ్య పర్సనల్ విబేషలు ఉన్నాయని, ఈ స్టార్ హీరోల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని బాలీవుడ్…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు దెబ్బ మీద తగులుతుంది. మొన్నటికి మొన్న తన సినిమా ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ కు రెండు రోజులు ఉంది అనగా నిర్మాత నట్టికుమార్ సినిమా ఆపివేయాలని స్టే తెచ్చిన విషయం విదితమే. తనవద్ద డబ్భులు తీసుకొని ఆ డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవరకు ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ ను ఆపివేయాలని తెలుపుతూ కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు స్టే విధించింది. ఇక…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కాంట్రవర్సీ అంతకంతకు ముదురుతోంది. విశ్వక్ సేన్- టీవీ యాంకర్ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్ గా మారిన విషయం విదితమే. డిబేట్ నడుస్తుండగా.. లైవ్ లో విశ్వక్, యాంకర్ ను అసభ్యకరమైన పదంతో ఆమెను దూషించడం, ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం, విశ్వక్ పై అందరు దుమ్మెత్తిపోయడం జరిగాయి. ఇక ఇటీవలే తన తప్పు తెలుసుకున్నానని, ఆ పదం అన్నందుకు సారీ చెప్తున్నానని మీడియా ముందే విశ్వక్…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస వివాదాలపాలవుతున్నాడు. మొన్నటికి మొన్న నడిరోడ్డుపై ఫ్రాంక్ వీడియో చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురికావడమే కాకుండా న్యూసెన్స్ కేసు నమోదు అయ్యేలా చేసుకున్నాడు. ఇక నిన్నటికి నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూకు వెళ్లి యాంకర్ పై అసభ్య పదజాలంతో నోరుపారేసుకొని వార్తల్లో నిలిచాడు. ఇదంతా ఎందుకు అంటే నా సినిమా ప్రజలలోకి వెళ్ళడానికి ఏదైనా చేస్తా అని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.…
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న చిన్న గొడవలతో తమ పార్టీలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం చూస్తే బాధేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తన పదవికి రాజీనామా కూడా చేస్తానన్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు దళితులపై పడుతున్నారని నారాయణస్వామి అన్నారు. వర్గాలుగా విడిపోయిన రెడ్లు ఏమైనా చేస్తారని అభిప్రాయపడ్డారు.…