Somu Veerraju: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ప్రకటించడంపై కవులు, కళాకారులు, సాహితీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చాగంటిని గురజాడ అవార్డుకు ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ విజయనగరంలో ర్యాలీ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఏలూరులోని బీసీ చైతన్యసభలో ఆయన ప్రసంగిస్తూ.. తన దృష్టిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏ అవార్డుకైనా అర్హులేనని తెలిపారు. గురజాడ అవార్డు ఎవరికి ఇవ్వాలనే విషయం ఆ అవార్డు అందించే…
T20 World Cup: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అన్ని రంగాలలో భారత్ వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు, రనౌట్లు మిస్ చేయడంతో విజయం చేజారింది. అయితే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ పిచ్‌పై తొలుత కావాలనే బ్యాటింగ్ తీసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత…
Poonam Kaur: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని వివాదాస్పద హీరోయిన్ పూనం కౌర్ కలిసింది. ఈ మేరకు కాసేపు రాహుల్ గాంధీతో కలిసి పూనం కౌర్ పాదయాత్రలో పాల్గొంది. అయితే రాహుల్ గాంధీని పూనమ్ కౌర్ కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. రాహుల్ చేయిని పూనమ్ కౌర్ పట్టుకున్న ఫోటోను బీజేపీ కార్యకర్త ప్రీతి గాంధీ పోస్ట్ చేయగా అది…
Rahul Ramakrishna: టాలీవుడ్‌లో రాహుల్ రామకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ రాహుల్ రామకృష్ణ హాట్ టాపిక్ అవుతుంటాడు. తాజాగా ఈరోజు గాంధీ జయంతి కావడంతో గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు గాంధీని ఉద్దేశిస్తూ నటుడు రాహుల్ రామకృష్ణ ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’ అని రాసుకొచ్చాడు. గాంధీ జయంతి నాడు…
Tirumala: టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ సందర్భంగా సీఎం జగన్ తిరుమల టూర్‌పై రమణ దీక్షితులు అసహనం వ్యక్తం చేశారు. తిరుమల పర్యటనలో సీఎం జగన్ వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ అమలుపై ప్రకటన చేస్తారని భావించామని.. ఆయన ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అర్చకులంతా తీవ్ర నిరాశ చెందారని రమణదీక్షితులు ఆరోపించారు. టీటీడీలోని బ్రాహ్మణ వ్యతిరేకులు అర్చక వ్యవస్థను, ఆలయ విధానాలను నాశనం చేసే లోపే తగిన చర్యలు తీసుకోవాలని…
Jay Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జై షాపై నెటిజన్‌లు మండిపడుతున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జాతీయ పతాకాన్ని జై షా అవమానించారంటూ నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి గెలిపించడంతో స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు, సెలబ్రెటీలు సంబరాలు చేసుకున్నారు.…
Teacher On Flag Hoisting: స్వాతంత్ర దినోత్సవం రోజు మతాలకతీతంగా, కులాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరూ జెండా వందనం చేస్తారు. మేరా భారత్ మహాన్ అంటూ గర్వం వ్యక్తం చేస్తారు. అయితే ఓ మహిళ మాత్రం తాను జెండా వందనం చేసేది లేదంటూ తెగేసి చెప్తోంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని ఓ పాఠశాలలో తమిళసెల్వి అనే మహిళ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పంద్రాగస్టు రోజు స్కూల్‌కు హాజరుకావాల్సిన ఆమె సెలవు పెట్టి గైర్హాజరు అయ్యారు. అయితే…