తిరుపతిలో వైసీపీ జాబ్ మేళా సందర్భంగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపై బండ్ల గణేష్ ఫైర్ అయ్యాడు. ఒక వ్యక్తితో ఉన్న వైరాన్ని కులానికి ఆపాదిస్తే చెప్పుదెబ్బలు ఖాయమని హెచ్చరించాడు. కమ్మవారిని కులం పేరుతో తిట్టడం తగదని, చెల్లెల్ని అన్న నుంచి దూరం చేసిన దగుల్బాజీ అని విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ విమర్శలు చేశాడు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి విషసాయి అంటూ ఆరోపించాడు.
అయితే బండ్ల గణేష్‌కు తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు.. అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి కానీ బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2022