మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస వివాదాలపాలవుతున్నాడు. మొన్నటికి మొన్న నడిరోడ్డుపై ఫ్రాంక్ వీడియో చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురికావడమే కాకుండా న్యూసెన్స్ కేసు నమోదు అయ్యేలా చేసుకున్నాడు. ఇక నిన్నటికి నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూకు వెళ్లి యాంకర్ పై అసభ్య పదజాలంతో నోరుపారేసుకొని వార్తల్లో నిలిచాడు. ఇదంతా ఎందుకు అంటే నా సినిమా ప్రజలలోకి వెళ్ళడానికి ఏదైనా చేస్తా అని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విశ్వక్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం ఈ నెల 6 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రమోషన్స్ కొత్తగా ట్రై చేసి విమర్శలపాలయ్యాడు.
ఇక తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో విశ్వక్ తాను చేసిన పనులకు మీడియా ముఖంగా సారి చెప్పాడు. ” ఫ్రాంక్ వీడియో ని కేవలం ప్రమోషన్స్ కోసమే చేశాం.. అన్ని ప్రాంక్ వీడియోలతో దీన్ని పోల్చడం సరికాదు. ఇక టీవీ ఛానెల్ లో యాంకర పై అరవడం తప్పే.. నేను కావాలని ఆ పదాన్ని(f**k) అనలేదు. కోపంలో సహనం కోల్పోయి నా నోటి నుంచి ఆ మాట వచ్చింది. అందుకు క్షమాపణలు కోరుతున్నాను. దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని ఎంత వేగంగా వస్తుందో.. కోపంలో ఉన్నా నాకు ఆ పదం అలా వచ్చేసింది. ఏదిఏమైనా మీడియా ముంచు ఆ పదం వాడినందుకు సారీ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశ్వక్ వివాదం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.