తిరుమల తిరుపతి దేవస్థానం అగర్‌బత్తీలు తయారుచేయడంపై ఏపీ సాధుపరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు ధార్మిక సంస్థా? లేక వ్యాపార సంస్థా? అని ఏపీ సాధుపరిషత్ ప్రశ్నించింది. శ్రీవారి పూజ అనంతరం నిర్మల్యాలను అగర్‌బత్తీలా మారుస్తామంటే అర్థం ఏంటని మండిపడింది. స్వామి వారి పూజకు వినియోగించిన పూలు పర్యావరణానికి హాని ఎలా అవుతాయో టీటీడీ చెప్పాలని ఏపీ సాధుపరిషత్ డిమాండ్ చేసింది. హిందూ వ్యతిరేక చర్యలను టీటీడీ ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికింది. స్వామివారికి అలంకారం…
భారతదేశంలోని మహిళలు చీరకట్టు అంటే ఎంతో ఇష్టం. అది మన సంప్రదాయానికి సూచిక కూడా. అయితే కేరళలో చీరకట్టు అంశం వివాదం రేపుతోంది. ఆ రాష్ట్రంలో మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు స్పందించారు. టీచర్లు తప్పనిసరిగా చీరలు ధరించాలనే పద్ధతి సరికాదని పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఆడవారి…
బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం రేపు విడుదల కానుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర అంకుల్స్ పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినిమా విడుదల నిలిపివేయాలని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శులు కార్యదర్శి రత్నా డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ మహిళలను కించ పరిచే సన్నివేశాలున్నాయని…
గత కొన్ని రోజులుగా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి, దర్శకుల సంఘం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రంలో భజ గోవిందం పదాన్ని ఎరోటిక్ సీన్స్ నేపథ్యంలో వాడారని, దాన్ని వెంటనే తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్స్ లోనూ కేసులు పెట్టారు. దాంతో దర్శకుడు యుగంధర్ తన ప్రమేయం లేకుండా ఆ పదం పొరపాటున ట్రైలర్ లో చేరిందని బేషరతుగా…
బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపికపై మళ్లీ వివాదం రాజుకుంటుంది. మఠాధిపతి ఎంపికపై హైకోర్టులో రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. తనపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఒప్పుకునే లాగా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మఠాధిపతిగా ఎంపికైన వెంకటాద్రి స్వామి నియామకాన్ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు అని సమాచారం. వీలునామా ప్రకారం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ అధికారులు మఠాధిపతిని ప్రకటించారని మారుతి మహాలక్ష్మమ్మ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
నేడు బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతుల బృందం పర్యటించనుంది. సామరస్యంగా పీఠాధిపతి వివాదం పరిష్కారం చేస్తామని అంటున్నారు పీఠాధిపతుల బృందం. కానీ వారి రాకను వ్యతిరేకిస్తున్నారు రెండో భార్య మహాలక్ష్మి. పీఠాధిపతులు వస్తున్న నేపథ్యంలో మఠం పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత ఏర్పాటు చేసారు పోలీసులు. ఇప్పటికే పీఠాధిపతుల బృందంపై డిజిపికి ఫిర్యాదు చేసారు మహాలక్ష్మి. అయితే బ్రహ్మంగారి మఠం వీరబ్రహ్మేంద్రస్వామి వారిని దర్శించుకున్నారు పీఠాధిపతుల బృందం. దర్శనం కోసం లోపలికి కొరకు పోలీసులు అనుమతి…
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఇది భారత్ కోవిడ్ వేరియంట్ అంటూ కథనాలు వచ్చాయి.. చాలా మంది నేతలు విమర్శలు చేశారు.. అయితే, ఈ విమర్శలను బీజేపీ తప్పుబట్టింది.. అంతేకాదు.. అది భారత్ వేరియంట్ అంటూ ఉండే కంటెంట్ మొత్తం తొలగించాలంటూ.. అన్ని సోషల్ మీడియా సంస్థలను కోరింది. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ గొప్ప దేశం కాదని,…