హుజూరాబాద్ ఎన్నికల వ్యూహం పై చర్చ చేశాం. మండలంకి ఓ ఇంచార్జీ, వారీతో పాటు నలుగురు నాయకులు అలాగే గ్రామానికి ఓ ఇంఛార్జి నియామకం చేస్తున్నం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. హుజూరాబాద్ లో కార్యకర్తల బలం మీదే మా నమ్మకం అని చూపిన ఆయన వందల కోట్లు దండుకుంటున్నారు తెరాస కి ఓటు వేస్తారా… లేదా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ కి ఓటు వేయాలో ఆలోచిస్తున్నారు జనం అని తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరిస్తారు అని నమ్మకం ఉంది అని చెప్పిన ఆయన బీసీ జనగణన పై సీఎం చేసిన తీర్మానం చేతులు దులుపుకోవడం లో భాగమే. మైనార్టీ, ఎస్సీల రిజర్వేషన్ లెక్కనే కేసీఆర్ చేతులు దులుపుకుంటారు అని అన్న ఆయన సకల జనుల సర్వే నివేదిక ఎందుకు బయట పెట్టడం లేదు అని మహేష్ గౌడ్ అడిగారు.