OpenAI vs Anthropic: ప్రధాని మోడీ ముందే.. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ ఏఐ సీఈవోల మధ్య రగడ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OpenAI vs Anthropic: ఓపెన్ ఏఐ vs ఆంథ్రోపిక్ ఏఐ మధ్య వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా భారత్‌లో జరిగిన ఏఐ ప్రభావ సదస్సులు ఈ ఇద్దరి సీఈవోల మధ్య రగడ కనిపించింది. గ్రూప్ ఫోటో తీసుకునే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)తో పాటు వేదికపై ఉన్న టెక్నాలజీ రంగ ప్రముఖులు అందరూ ఒకరికొకరు చేతులు కలిపి పైకి ఎత్తారు. ఐక్యతకు గుర్తుగా తీసుకున్న ఈ ఫొటోలో మాత్రం ఇద్దరు ప్రముఖులు భిన్నంగా కనిపించారు. ఈ ఇద్దరే ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman), ఆంథ్రోపిక్ ఏఐ డారియో అమోడెయ్ (Dario Amodei). అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పైకి లేపితే.. ఈ ఇద్దరు మాత్రం తమ తమ చేతులను విడిగా పైకి ఎత్తారు. ఆ చిన్న తేడా కెమెరాలో చిక్కింది. వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కట్ చేస్తే.. నిమిషాల్లోనే వీటిపై అనేక జోకులు, ట్రోల్స్ బయటకు వచ్చాయి. కొందరు ఈ సన్నివేశాన్ని సరదగా తీసుకున్నారు. మరికొందరు దీని వెనుక అసలు కథ గురించి శోధిస్తున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన పోటీ గురించి ఇప్పటికే టెక్నాలజీ ప్రపంచంలో చర్చ ఉంది.
READ MORE: Pakistan Cricket: బాబర్‌ను తీసేయాలని చెప్తే, నన్నే తీసేశారు.. పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ప్రస్తుతం OpenAI సంస్థ వేగంగా కొత్త ఉత్పత్తులను తీసుకురావడం, ఎక్కువ మందిని ఆకట్టుకునేలా ముందడుగు వేస్తోంది. మరోవైపు Anthropic సంస్థ సైతం భద్రత, బాధ్యతతో వినియోగం వంటి అంశాలపై దృష్టి పెడుతోంది. ఈ రెండు సంస్థల ఆలోచనలు, ఈ కంపెనీల సీఈవోల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఆ ఫొటోలో కనిపించాయని చాలా మంది అనుకుంటున్నారు. డారియో అమోడెయ్ ఒకప్పుడు ఓపెన్‌ఏఐలోనే పని చేశారు. ఏఐ వృద్ధిలో తోడ్పాటునందించారు. అక్కడి నుంచి బయటకు వచ్చి తనతో పనిచేసిన కొంతమందితో కలిసి కొత్త సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలు ఏఐ రంగంలో గట్టి పోటీదారులుగా మారాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ సంఘటనను కొందరు “ఏఐ కోల్డ్ వార్” అని వ్యాఖ్యానించారు. ఇంకొందరు మాత్రం ఇది కేవలం ఒక సాధారణ క్షణమే తప్ప దీనికి అంత అర్థం వెతకాల్సిన అవసరం లేదంటున్నారు.
READ MORE: Kim: న*గ్నంగా ఊరేగించాడు.. సొంత మామనే కుక్కలతో కరిపించి చంపాడు.. కిమ్ కిరాతకం!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!