2019 లోక్‌సభ ఎన్నికలు నిరాశపరిచినా వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపాలని ప్రియాంక తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజల చూపు నిరంతరం తన వైపు ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2022 ఎన్నికలు ఆమెలోని గాంధీ కుటుంబ సమ్మోహన శక్తికి పరీక్ష కానున్నాయి. ప్రియాంక తన హావభావాలే కాదు.. యాక్షన్ లో కూడా నానమ్మ ఇందిరా గాంధీని గుర్తుచేస్తున్నారు. మరోవైపు, ప్రియాంక గాంధీ రాజకీంగా తన అన్న రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నారు. కానీ ఆప్పుడప్పుడు తనదైన స్టయిల్లో.…
2010లో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ రికార్డు నెలకొల్పారు. అయితే అధ్యక్షురాలిగా ఆమె ప్రయాణం అక్కడే ఆగలేదు. మరో ఏడేళ్లు కంటిన్యూ అయింది. అంటే వరసగా 19 ఏళ్లు ఆమె కాంగ్రెస్ అధినేత్రిగా పార్టీని నడిపారు. తిరిగి 2019లో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష పగ్గాలు స్వీకరించాల్సి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ -ఈ నలుగురూ కలపి పార్టీని ఎన్నేళ్లు నడిపించారో..సోనియా గాంధీ ఒక్కరే దాదాపు అన్నేళ్లు సారధ్యం…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి బల్మూరి వెంకట్ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వాస్తవానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలే కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాయని, తెలంగాణాలో ఒకరినొకరు తిట్టుకొని ఢిల్లీలో కలుస్తున్నారన్నారు. అంతేకాకుండా కేసీఆర్‌కు దళిత బంధు ఇచ్చే అలోచన లేదని, అది కేవలం ఎన్నికల జిమ్మిక్కేనన్నారు. ఉప ఎన్నికలు ముగిసిన తరువాత…
టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తెలంగాణలో అంపశయమీద ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరిపోసి, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు అహర్నిషలు కష్టపుడుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించే విధానంతో కాంగ్రెస్ కు కరెక్టు నాయకుడు వచ్చాడని కార్యకర్తలు అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో…
రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే విద్యార్థినులకు స్మార్ట్ఫోన్లు, స్కూటీలు ఇస్తామని ప్రియాంక గాంధీ తెలిపారు. డిగ్రీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, 12వ తరగతి పాసైన విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్నారు. ఇప్పటికే మహిళలకు 40శాతం టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏండ్లుగా కోల్పోయిన అధికారన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోని లేని పరిస్థితి ఉంది. దీంతో ఈ సారి ఎలాగైనా ఉత్తరప్రదేశ్ లో పాగా వేయాలని చూస్తోంది.…
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకుంది. బీజేపీ తరఫున పోటీచేస్తున్న ఈటల రాజేందర్‌కు మద్దతుగా హేమాహేమీలు ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ ఎంపీ విజయశాంతి. తెలంగాణ ఉద్యమంలో ఈటెల నేను కలిసి పని చేశాం. ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ హుజురాబాద్ లో అడ్డా వేశారన్నారు. ఒక ఉద్యమ కారుడు ఈటల.. ఆలాంటి వ్యక్తిని ఎందుకు ఓడిస్తావు కేసీఆర్ అని ప్రశ్నించారు విజయశాంతి.…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పోటీలో లేకున్నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో వున్నాయి. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు వెలువడతాయి. 2019లో 77శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఓటింగ్ పెంచాలని, మెజారిటీ ఎక్కువ వచ్చేలా చూడాలని అధికార పార్టీ భావిస్తోంది. అయితే ఇక్కడ పొటీచేస్తున్న రెండు జాతీయ పార్టీల గురించే అంతా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి అంపశయ్యమీదే వుంది. ఎక్కడా సరైన…
ఆ మాజీ మంత్రి ఇంటిపోరుతో సతమతం అవుతున్నారా? రాష్ట్రస్థాయిలో పార్టీలో కీలకంగా ఉన్నా.. సొంత నియోజకవర్గంలోని పరిణామాలు రుచించడం లేదా? కొత్త తలనొప్పులు వస్తున్నాయా? ఇంతకీ ఎవరా నేత? ఏమా కథ? జహీరాబాద్ కాంగ్రెస్‌లో గ్రూపులతో వేగలేకపోతున్నారా? ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి వరసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గీతారెడ్డి. అంతకుముందు గజ్వేల్‌లో సత్తా చాటారు. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా జహీరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. గత ఎన్నికల్లో గీతారెడ్డిని ఓటమి పలకరించింది. ముగ్గురు…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గత కొంతకాలంగా కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు తగ్గట్టుగానే ఆయన కాంగ్రెస్ లో చురుకైన పాత్రను పోషిస్తూ వచ్చారు. అయితే, పంజాబ్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన తరువాత కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. బెంగాల్ ఎన్నికల తరువాత ఎన్నికల వ్యూహకర్తగా విధులు నిర్వహింబోనని చెప్పడంతో ఆయన కాంగ్రెస్ చేరుతారనే వార్తలు వినిపించాయి. అయితే, కాంగ్రెస్‌లో కొంతమంది పెద్దలు ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహాల వరకే…
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి మరో వారం రోజులే మిగిలాయి. దాంతో క్యాంపెయిన్ తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్స్ ఒక్కొక్కరుగా రంగంలో దిగుతున్నారు. అధికార పార్టీ నెల క్రితమే మంత్రి హరీష్ రావును రంగంలో దించింది. మరో రెండు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలను ప్రచారంలోకి దించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కేసీఆర్‌కు ప్రతిష్టకు సవాలుగా మారింది. గెల్లును గెలిపించే బాధ్యతను మంత్రి హరీష్ రావు…