టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అ సందర్భంగా ఆయన మీడయాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికేతరుడని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. మరి హరీశ్‌రావుది సిద్ధిపేట కాదని, కేటీఆర్ ది సిరిసిల్ల కాదని.. వారు కూడా స్థానికేతరులనేని గుర్తు చేశారు. స్థానికేతరులైన కేటీఆర్, హరీశ్‌రావులకు ప్రజలు అవకాశం ఇస్తే విర్రవీగుతున్నారన్నారు. అంతేకాకుండా 2009 ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డి కష్టపడి నిర్మించుకున్న…
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జోరు పెంచింది. పీసీసీ అధ్యక్షుడు హుజురాబాద్ నియోజవకర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం జీడీపీ పెంచుతామంటే దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతారనుకున్నామని.. కానీ జీ అంటే గ్యాస్.. డీ అంటే డీజిల్.. పీ అంటే పెట్రోల్ ధరలు పెంచుతారని మేమేం ఊహించలేదంటూ బీజేపీ నేతలకు చురకలు అంటించారు. అంతేకాకుండా హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎందుకు బీజేపీకి ఓటు వేయాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనితో పాటు…
హుజురాబాద్ బరిలో ఉన్న కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్ పట్టుకుందా? ఇన్నాళ్లూ తమ కేడర్ ఓటు పడితే చాలు.. పరువు దక్కుతుందని భావించిన పార్టీ వర్గాలు.. ఇప్పుడు ఏ విషయంలో ఆందోళన చెందుతున్నాయి? ఓటు బ్యాంక్‌తో పార్టీ నేతలకు వచ్చిన తంటా ఏంటి? లెట్స్ వాచ్..! కాంగ్రెస్‌కు వచ్చిన సమస్యపై నేతల్లో చర్చ..! హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార TRS.. బీజేపీ మధ్య ప్రచారం మొదలుకుని.. పాలిటిక్స్ వరకు పోటా పోటీగా నడుస్తున్నాయి. ఈ రెండు పార్టీలు గెలుపుకోసం చేయని…
బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండగా అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. బద్వేల్ లో వైసీపీ గెలుపు ఏకపక్షంగానే కన్పిస్తుండటంతో ఆపార్టీ భారీ మోజార్టీపై గురిపెట్టింది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని నేతలంతా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ తమ్ముళ్లు మాత్రం ఎవరికీ ఓటు వేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. బద్వేల్…
హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ పై మాటల తూటాలు పేల్చారు. క్యాబినెట్లో ఉన్న వాళ్లలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు ఈ మధ్య కాంగ్రెస్ మీద ప్రేమ ఎక్కువైందన్నారు. భట్టి మంచోడు అంటాడు, మంచోడైన భట్టిని ప్రతిపక్ష హోదా నుంచి ఎందుకు తీసేశాడో సమాధానం చెప్పాలన్నారు. గాంధీ భవన్‌కు గాడ్సే రావడం కాదు టీఆర్ఎస్…
రాష్ట్రమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎక్కడికి వచ్చి మాట్లాడినా అందులో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి తప్పక ఉంటోంది. ఈ రోజు కేటీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్, పీసీసీ రేవంత్ రెడ్డిలు రహస్య ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ మహిళా నేత డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్, ఈటల భేటీ…
తిరుపతి కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ బీజేపీ, టీడీపీ, వైసీపీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకువస్తున్నా దేశ ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని.. దేశం ప్రమాదపు అంచుల్లో ఉందన్నారు. ప్రధాని అత్యంత ఆప్తుడి పోర్టులో రూ. 20 కోట్ల విలువ చేసే హెరాయిన్ దొరికితే అతన్ని అరెస్టు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లీటర్ డీజిల్ పై రూ. 50 ఉంటే, బీజేపీ హయాంలో రూ.100కుపైనే ఉందన్న ఆయన.. దేశంలో అభివృద్ధి…
దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.. పెద్ద రాష్ట్రం కావడం.. ఎక్కువ మంది ఎంపీలు ప్రానిథ్యం వహించే రాష్ట్రం కూడా కావడంతో.. జాతీయ పార్టీలు ఈ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ వస్తున్నాయి.. ఇక, స్థానిక ఎస్పీ, బీఎస్పీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు, బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.. కొత్త వ్యూహాలతో ప్రజల ముందుకు వెళ్తోంది..…
అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. దీంతో ఆత్మగౌరవం అంటూ ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఈటల సోలోగా ఉప ఎన్నిక బరిలో దిగుతారని, సొంత పార్టీ పెడుతారంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ ఈటల అనూహ్యంగా బీజేపీలోకి చేరారు. దీంతో ఈటల ఒంటిరిగా పోరాడుతాడనుకున్న గులాబి నేతలకు షాక్ తగిలినట్లైంది.…
తెలంగాణలో ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార టీఆర్ఎస్ పార్టీని ‘చపాతీ రోలర్’ వెంటాడుతూనే వస్తోంది.. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించే ‘రొట్టెల పీట’ (చపాతీ రోలర్) కారు గుర్తుకు తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఓటమి ప్రధాన కారణం ఈ చపాతీ రోలరే అని నిర్ధారణకు వచ్చిన టీఆర్ఎస్ నేతలు.. అంతే కాదు, దుబ్బాక బై…