కేసీఆర్ అసమర్థతతోనే ప్రాజెక్టులన్ని సమాధి అవుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయనా మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై NGT స్టే ఇచ్చిందని, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి చూశారు .. ఇప్పుడు పనులు మధ్యంతరంగా ఆగిపోయాయన్నారు. కేసీఆర్‌కు కొందరు కాంట్రాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు, ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ చేశారు. మూడేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఆరేళ్లయినా పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వం అసమర్థత వల్లే ప్రాజెక్ట్ నిర్మాణం పై NGT స్టే ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రజల హక్కులను జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కేసీఆర్ పెడుతున్నారన్నారు. ఎన్నో సార్లు NGT దగ్గరకు ప్రభుత్వం వెళ్ళింది.. కానీ వెళ్లిన ప్రతి సారి సరైన ప్రణాళికలు లేకుండా వెళ్తుంది. 2017 లో కేంద్ర పర్యావరణ శాఖ దగ్గర పెట్టిన దరఖాస్తును కేసీఆర్ ఎవరికి తలొగ్గి ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. దరఖాస్తు ఉపసంహరణపై దక్షిణ తెలంగాణ రైతులకు కేసీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.
ప్రాజెక్ట్ పై ప్రభుత్వ నిర్లక్ష్యంతో దక్షిణ తెలంగాణ రైతుల ఆశలు ఆవిరి అవుతున్నాయి. ఇష్టమొచ్చినట్టు ప్రాజెక్టులు రీ డిజైన్ చేశావ్ ఎలా డిజైన్ చేయాలో తెలియదా..? జగన్మోహన్ రెడ్డి గారితో ప్రాజెక్ట్ ఆపకుండా చెయ్యొద్దని, NGTకి వెళ్లొద్దని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.16 మంది ముఖ్యమంత్రులు ఒకే సచివాలయం నుంచి పరిపాలన చేస్తే.. ఇప్పుడు కొత్త సచివాలయం. పుత్రరత్నం ముఖ్యమంత్రి కావాలంటే వాస్తు లోపం పోవాలని నూతన సచివాలయం నిర్మిస్తున్నాడని రేవంత్ వ్యాఖ్యానించారు.
జూరాల కట్ట మీద, శ్రీ శైలం గట్టు మీద కేసీఆర్ ని ఉరి తీసిన తప్పు లేదని రేవంత్ అన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర ప్రభు త్వం నుంచి ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇప్పించాలని సవా ల్ విసిరారు. షర్మిల పాదయాత్ర చేయడం, ప్లీనరీలో తెలుగు తల్లి బొమ్మ, ఏపీలో పార్టీ ప్రస్తావన.. మంత్రి పేర్ని నాని సమర్థన ఇవ్వన్నీ .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిశగా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌ల కుట్రలా కనిపిస్తుందన్నారు. ఫ్లీనరీలో తెలుగు తల్లి విగ్రహం పెట్టారని, వాటిని మేము సాక్షాలతో చూపిస్తే.. TRS మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ప్రాజెక్ట్ పై స్టే విషయంలో కేసీఆర్ ఇంకా ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. ఏపీ నాయకులు మళ్ళీ రాష్ట్రాల్ని కలుపుదాం అంటే టీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదు.? త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, కుటుంబ స్వార్థం కోసం తెలంగాణకి అన్యాయం చేస్తే, ప్రజలు చెంపలు పగులగొడ్తరని రేవంత్ రెడ్డి అన్నారు.