ఉత్తరప్రదేశ్‌లో శాంతి, ప్రగతి కోసం ఓటు వేయాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం ఉత్తరప్రదేశ్ ప్రజలను కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొత్త భవిష్యత్తు ఏర్పడుతుందని రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు. “ఓటింగ్ ఉత్తరప్రదేశ్‌లో ఉంటుంది. దేశమంతటా మార్పు వస్తుంది! శాంతి, ప్రగతి కోసం ఓటు వేయండి – కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొత్త భవిష్యత్తు ఏర్పడుతుంది’ అని ట్వీట్ చేశారు.ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు 59 నియోజకవర్గాల్లో…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుడ్‌బై చెప్పడం దాదాపు ఖరారు అయినట్టే కనిపిస్తోంది.. సీనియర్లు చెప్పడంతో 3-4 రోజులు ఆగానని.. ఆగినంత మాత్రన వెనక్కి తగ్గేదిలేదని రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.. ఏ పార్టీలో చేరను.. స్వతంత్రంగానే ఉంటా.. రాజకీయా పార్టీ కూడా పెడతానంటూ ప్రకటించారు జగ్గారెడ్డి… అయితే, ఇప్పటికే చాలా మంది రంగంలోకి దిగిన జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి…
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం పక్కా… వెనక్కి తగ్గేదేలేదని కుండబద్దలు కొట్టేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి… కాంగ్రెస్ అధిష్టానికి లేఖ రాసిన ఆయన.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా, కానీ, 3-4 రోజులు టైం తీసుకొని ఆలోచించుకోమని సీనియర్లు చెప్పారు.. అందుకే ఆగానని.. సమయం తీసుకున్నా రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదన్నారు.. ఎవరికీ భయపడేది లేదు, ఎవరికీ…
తెలంగాణలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. అధిష్టానానికి లేఖరాసిన ఆయన.. పార్టీలో ఉన్న పరిస్థితిని.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.. పరోక్షంగా టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేశారు.. ఇక, ఈ లేఖ రాసిన వెంటనే.. తాను కాంగ్రెస్ గుంపులో లేను అంటూ పేర్కొని చర్చకు తెరలేపారు.. త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే,…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాస్త దూరంగానే ఉంటున్నారు.. కొన్ని సందర్భాల్లో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నా.. వారి మధ్య మనస్పర్దలు కొనసాగుతూనే ఉన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నమాటలు.. అయితే, తాజాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక, రేవంత్, కోమటిరెడ్డి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. ఇద్దరూ రెడ్లు…
ఓవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతుంటే.. మరోవైపు.. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ… ఈ వ్యవహారంలో టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.. అయితే, ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ముఖ్యమంత్రి జన్మదినం చేస్కోవడంలో తప్పేముంది..? అని ప్రశ్నించారు.. సీఎం బర్త్‌డేకు నిరుద్యోగానికి సంబంధం ఏంటి? అని నిలదీశారు..…
అస్సాం సీఎం రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లు నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అస్సాం సీఎంపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, అస్సాం సీఎంపై కేసు నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా నేడు సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. టీపీసీసీకి అధ్యక్షుడిగా నిమామకమైన తరువాత మొదటి సారి మంగళవారం రేవంత్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామన్న వాతావరణం సృష్టించేందుకే కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలను గందరగోళంలో పడేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ మోడీ కోవర్ట్…
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించడం.. ప్రధాని మోడీ, బీజేపీ అధిష్టానంపై ఓ రేంజ్లో ఫైర్ అవ్వడంతో… మళ్లీ కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూస్తున్నారంటూ రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓవైపు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్‌కు చురకలు అంటించారు.. కాంగ్రెస్…
ఇటీవల అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అస్సాం సీఎం వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అస్సాం సీఎం మాటలు దేశంలో ఉన్న తల్లులను అవమానించేలా మాట్లాడారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట…