Goa: ఫలితాలపై ఉత్కంఠ.. క్యాంపులకు అభ్యర్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.. హంగ్ అసెంబ్లీ ఏర్పడనుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఒక్కసారిగా గోవాలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.. రాజకీయ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముందు జాగ్రత్తగా, కాంగ్రెస్ తన అభ్యర్థులందరినీ క్యాంప్‌లకు తరలించారు.. ఇవాళ ఒక రిసార్ట్ నుంచి మరొక రిసార్ట్ కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తలరించారు.. గోవా ఫలితాలు, ఆ తర్వాత పరిణామాల పర్యవేక్షణ కోసం ఇప్పటికే గోవా చేరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివ కుమార్.. ఇక, బీజేపీ నేతలకు కూడా రంగంలోకి దిగుతున్నారు.. ఇవాళ రాత్రికి గోవాకు వెళ్లనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవిస్ తో పాటు ఇతర నేతలు… ఇప్పటికే ఎంజీపీ, బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థులతో టచ్ లోకి వెళ్లిపోయారు బీజేపీ నేతలు..
Read Also: Gun Firing: సిద్దిపేటలో కాల్పుల కలకలం
Also Read
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
ఇక, బీజేపీకి చెందిన ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ పూర్తవ్వగా, ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఓ కన్నేసి ఉంచేందుకు సీనియర్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు పి.చిదంబరం, రాష్ట్ర ఇన్‌చార్జి దినేశ్ గుండూరావు, డీకే శివకుమార్ ఆదివారం నుంచి గోవాలోనే ఉన్నారు. ఇప్పటికే క్యాంపుల్లో ఉన్న ఫలితాల అనంతరం గెలిచిన వారు పార్టీ కార్యాలయానికి తిరిగి రావాల్సి ఉంటుంది అని చెబుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతుల.. మరోవైపు.. గోవాలో గెలిచే ప్రతి సీటూ కీలకమైంది కావడంతో టీఎంసీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. బేరసారాలు, క్యాంపు రాజకీయాలకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తోంది. వాటికి ఆస్కారం లేకుండా ఎత్తుగడలు వేస్తోంది.. కాగా, 40 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ చెరో 16 సీట్లు గెలుచుకుంటాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మెజారిటీ సంఖ్య మాత్రం 21. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో జట్టుకట్టి రాష్ట్రంలో మొదటిసారిగా అభ్యర్థులను బరిలోకి దించిన టీఎంసీకి మూడు సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. దీంతో, గోమంతక్ పార్టీ, టీఎంసీలతోపాటు ఆప్‌తోనూ చర్చలకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ చెబుతోంది.. మరి రేపు ఫలితాలు ఎలా ఉంటాయి? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఆసక్తికరంగ మారింది.
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!