TPCC President Revanth Reddy satirised the job vacancies announced by CM KCR today.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో 91 వేల పై చిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఖాళీలు ఎప్పటి లోపు భర్తీ చేస్తారో చెప్పలేదని సెటైర్ వేశారు. గతంలో లక్ష ఏడూ వేలు ఖాళీలు ఉన్నాయని, మరొక 50 వేలు ఖాళీ కాబోతున్నాయని 7 సెప్టెంబర్ 2014 చెప్పారన్నారు. లక్ష 50 వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు.. బిస్వాల్ కమిటీ లక్ష 91 వేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు.
39 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇవాళ సభ లో కేసీఆర్ అబద్ధాలు చెప్పాడని, లక్ష 50 వేలు ఖాళీలు ఉన్నాయని, 80 వేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రకటించాడన్నారు. మిగిలిన ఉద్యోగాలు కాకి ఎత్తుకు పోయిందా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ని ఉద్యోగాలు అడుక్కోవాల్సిన అవసరం లేదని, 12 నెలలలో మన ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని, కేసీఆర్ ఉద్యోగం పోతే తప్ప నిరుద్యోగులు కు ఉద్యోగాలు రావని ఆయన మండిపడ్డారు.