తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేయాలంటూ.. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. 42 మంది ఎమ్మెల్యే లతో తెలంగాణ కోసం లేఖ రాసింది తెలంగాణ కాంగ్రెస్ నేతలేనని ఆయన అన్నారు. కోట్లాడిన వాళ్ళకే బీ ఫామ్ అని, కోటా లేదు..వాటా లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు. కొట్లాటలో ఉన్నోళ్లకే టికెట్లు.. ఇంటికి తెచ్చి ఇస్తానని ఆయన అన్నారు. కొత్తగా వచ్చిన రాష్ట్రం…
తెలంగాణ కాంగ్రెస్ లో కుదుపునకు కారణం అయ్యారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. పదిహేను రోజుల పాటు తన రాజీనామాకు బ్రేక్ వేసావనన్నారు జగ్గారెడ్డి, సోనియా గాంధీని, రాహుల్ గాంధీ ని కలవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు జగ్గారెడ్డి. ఇదే సమయంలో తాజాగా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే…
Live : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరసన దీక్ష.. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి.
నా రాజకీయ జీవితం ప్రారంభం అయ్యిందే యూత్ కాంగ్రెస్ తో అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ కోటాలో మంత్రిని అయ్యాయని, నాదేమి పెద్ద కుటుంబం కాదన ఆయన అన్నారు. పని చేస్తే ఎమ్మెల్యే లు..మంత్రులు అవుతారని, కష్టపడి పని చేయండి.. రాహుల్ గాంధీ టికెట్స్ కూడా ఇస్తారని ఆయన వెల్లడించారు. ఖాళీ లు వెంటనే పూర్తి చేయాలని, నిరుద్యోగులు రోడ్ల మీదకు రావాలన్నారు. అందరితో కలిసి…
తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వ్యక్తిగత విమర్శలు మానుకో అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎంపీ రంజిత్ రెడ్డి హెచ్చరించారు. చాతనైతే ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం పార్లమెంట్లో మాతో పాటు కొట్లాడు అని ఆయన అన్నారు. వరి కొనుగోలు కోసం కేంద్రంతో…
పరిగిలో రేవంత్ రెడ్డి పిచ్చిలేసినట్టు మాట్లాడాడు.. రేవంత్ రెడ్డి ఒక కమెడియన్ అంటూ ప్రభుత్వం విప్ బాల్క సుమన్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రేవంత్ లో విషం తప్పా …విషయం లేదని, రైతు ఆత్మహత్యలు ఎక్కువగా కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ చంద్రబాబు చెప్పులు మోసారు అని ఆయన విమర్శించారు.. రేవంత్ రెడ్డి జోకర్ లెక్క మాట్లాడుతున్నాడు…ఒక ట్యూటర్ ను పెట్టుకోవచ్చు కదా అని…
టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. నిర్మల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజక వర్గ స్థాయి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ఏఐసీసీ తరఫున శ్రీనివాస కృష్ణన్, మాణిక్కం ఠాకూర్ హాజరయ్యారు. సమావేశం లో ఏడు నియోజక వర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ లో టీఆర్ఎస్ వైస్ చైర్మన్ ఒక ఎస్సీ మైనర్…
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారానికి పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)ను ఇవాళ ప్రారంభించారు.. ముదిగొండ మండలం యడవల్లిలో యాత్ర ప్రారంభమైంది.. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఖమ్మం జిల్లా నాయకులు ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభించిన యడవెల్లి జన ఉప్పెనగా మారింది. గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ఆది నుంచే సమస్యలకు నెలవైంది. ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎంతో మంది రైతులు పేర్లు మారిపోవడం.. గుంట స్థలం ఉన్నవారికి ఎకరా స్థలంగా నమోదైతే.. ఇక ఎకరాల భూమి ఉన్న రైతు గుంట స్థలానికి యజమానికిగా చూపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పడు అధికారులు ధరణి పోర్టల్ను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్…
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఈసారి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో సైకిల్ ర్యాలీలు,మోటార్ బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలను నిర్వహించిన భట్టి విక్రమార్క ఈసారి ఏకంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి మధిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈ యాత్ర సాగనుంది. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు నియోజకవర్గ సమస్యలను దృష్టికి తీసుకుని వెళ్లేందుకు యాత్రను చేపట్టనున్నారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇంకా నియోజకవర్గంలో తన…